ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ట్రైన్ డ్రైవర్ సురేఖ యాదవ్ రైల్వేల్లో 36 ఏళ్ళ సర్వీస్ తరువాత రిటైర్ అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలో లోకో పైలెట్ గా ఉన్నారు. సురేఖ యాదవ్ తన సర్వీస్ లో గూడ్స్ రైళ్లు, ఎక్స్ప్రెస్ రైళ్లు, వందేభారత్ రైలుకు కూడా పైలెట్ గా ఉన్నారు. ఆమె లోకో పైలెట్ అయినా తరువాత దేశంలో 16 మంది మహిళలు ట్రైన్ పైలెట్ లు అయ్యారు. ఈ రంగంలో ఇలాంటి విప్లవానికి ఆమె బీజం వేశారు. తన సర్వీసులో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆమె 1989 ఫిబ్రవరి 13 వతేది సర్వీస్ లో చేరారు.

డెక్కన్ క్వీన్, రాజధాని ఎక్స్ప్రెస్ లకు కూడా డ్రైవర్ గా పనిచేసారు. 36 ఎలా సర్వీస్ లో ఆమె పై ఒక్క రిమార్క్ కూడా లేదు. తన సర్వీస్ లో సూపర్ ఫాస్ట్ రైళ్ళకు పైలెట్ గా పనిచేయడం ఒక మంచి అనుభవమైతే , నాన్ స్టాప్ హై స్పీడ్ గూడ్స్ రైళ్లకు పైలెట్ గా ఉండటం మరో అనుభవం అంటారు. డీజిల్ ఇంజిన్ లోకో పైలెట్ గా మొదలైన ఈ ప్రయాణంలో ఆమె షంటింగ్ విధులు కూడా నిర్వహించారు. ఆమె భారతదేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే మొదటి లోకో పైలెట్.. ఆ ఘనత ఆమెకు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రైల్వే చరిత్ర పుటల్లో చేరిపోతుంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

