22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

అంతరిక్ష కేంద్రానికి తొలిసారిగా భారతీయుడు

ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అంతరిక్ష ప్రయోగాలకు కేంద్రబిందువుగా ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి  తొలిసారిగా ఒక భారతీయుడు వెళ్లనున్నారు. భారతీయ వైమానిక దళానికి చెందిన గ్రూప్ కమాండర్ శుభాంశు శుక్లాకు ఈ అరుదైన అవకాశం దక్కింది. సోవియట్ సోయుజ్ టీ 11 ద్వారా రాకేశ్ శర్మ 1984లో తొలిసారిగా అంతరిక్షయానం చేసి వచ్చారు. ఆయన తర్వాత ఇప్పటి వరకు భారత్ నుంచి వ్యోమగాములు ఎవరూ లేదు. ఇన్నాళ్లకు శుభాంశు శుక్లాలకు అంతర్జాతీయ బృందంతో కలసి అంతరిక్షయానం చేసే అవకాశం రావడం విశేషం.

మే 29న ఐఎస్ఎస్ కు బయలుదేరనున్న వ్యోమగాముల బృందంలో శుక్లాతో పాటు అమెరికన్ జాతీయ అంతరిక్ష సంస్థలో పనిచేసిన వ్యోమగామి పెగ్గి విట్సన్, పోలిష్ అంతరిక్ష సంస్థ  సభ్యుడు స్లావోజ్ ఉజ్నాన్ స్కీ, హంగేరియన్ అంతరిక్ష పరిశోధక సంస్థ సభ్యుడు టైబర్ కాపు కూడా ఉన్నారు. ‘పోల్సా”: ‘హెచ్ఎస్ఓ’లకు ఈ మిషన్ లో యురోపియన్ అంతరిక్ష సంస్థ సహకారం అందిస్తోంది. ఈ బృందం మే 29న ఐఎస్ఎస్ కి చేరుకోనుంది. ఏఎక్స్- 4 పేరిట చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోనున్న ఈ బృందం అక్కడ ఏడు ప్రయోగాలను చేపట్టనుంది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.