భవిష్యత్తులో విమాన ప్రయాణం మరింత చౌక కానుంది. ఎలక్ట్రిక్ బైక్‌లు.విద్యుత్ కార్ల తరహాలోనే.. కరెంటు ఛార్జింగ్ తో ప్రయాణించే విమానాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. పౌర విమానయాన చరిత్రలోనే తొలిసారిగా నలుగురు ప్రయాణికులను తీసుకొని ఓ విద్యుత్ విమానం గాల్లోకి లేచి.సురక్షితంగా గమ్యస్థానాన్ని చేరుకుంది.
ప్రస్తుత రోజుల్లో విమాన ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.అప్పుడప్పుడూ విమానయాన సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నా.. ఇప్పటికీ విమాన ప్రయాణం చాలామందికి కలగానే మిగిలిపోయింది. అయితే ఈ కొత్త రకం విద్యుత్ విమానం కేవలం.. 694 రూపాయలతో 130 కిలోమీటర్లు ప్రయాణించినట్టు అమెరికా విమానయాన కంపెనీ ప్రకటించింది. హెలికాప్టర్‌కు అయ్యే ఇంధనం ఖర్చు కంటే తక్కువలోనే ఈ ఎలక్ట్రిక్ విమానం ప్రయాణించింది. ఈ విమానాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే విమాన ప్రయాణ ఖర్చు చాలావరకూ తగ్గిపోతుంది. అందరికీ విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

