22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

అబ్బో ,నక్కలో కూడా ఇంత అందమా ?

సృష్టి చాలా విచిత్రమైనది. భూమ్మీద మనం చూడని, చూడలేని జంతువులకు, కీటకాలకు, జలచరాలకు ,వృక్ష సంపదకు ఆలవాలం. సృష్టి ఆవిర్భవించి కోట్ల సంవత్సరాలు గడుస్తున్నా , ఇప్పటికీ మానవుడు చూడని, చూడలేని అంతుచిక్కని జీవరాశులు ఎన్నో ఉన్నాయి. జీవం ఆవిర్భావం నుంచి ఎన్నో ప్రాణులు రూపాంతరాలు చెందాయి. వాటి శిలాజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. అయితే కంటికి కనిపించని జీవుల ఆవిర్భావం ఎప్పుడు ఎలా జరిగిందో ఇప్పటివరకు చర్చనీయాంశమే.

తాజాగా ఓ అందమైన నక్క ఒకటి బయటపడింది. అప్పుడప్పుడు ఇలాంటి నక్క ఉందని చెబుతూనే ఉన్నారు. అరుదుగా కనిపించే ఈ నక్కను ఫైర్ ఫోక్స్ అంటారు. వేటలో మహా దిట్ట అట. దీన్ని వేటకోసం పెంపుడు జంతువుగా కొన్ని ఆటవిక జాతులు వాడేవని చెబుతారు. మూడు రంగులు కలగలిసిన ఈ నక్క మెలనిన్ అనే కణజాలం మార్పు కారణంగా ఇలా మారిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.