హనీమూన్ యాత్రలోనే భర్తను దారుణంగా చంపించిన కిరాతకురాలైన భార్య ఉదంతం దేశంలో సంచలన సృష్టించింది. ఇండోర్ కి చెందిన సోనమ్ , రఘువంశీకి ఇద్దరికీ గత నెలలో పెళ్లి అయింది. పెళ్లయిన వారం రోజులకి ఇద్దరు మేఘాలయకు హనీమూన్ కు బయలుదేరారు . హనీమూన్ లోనే రఘు వంశీ హత్యకు భార్య సోనమ్ స్కెచ్ వేసింది. క్రైమ్ సినిమాను తలపించే ప్లాన్ చేసింది.. భర్తను చంపించి తరువాత కనిపించకుండా పోయింది. ఈ హత్య అటు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ, మేఘాలయలోనూ అత్యంత సంచలనం సృష్టించింది .
చివరకు దేశవ్యాప్తంగా ఉత్కంఠతను రేపింది. సిబిఐ దర్యాప్తును కూడా ఇరువైపులా వారు కోరుకున్నారు. ఈ పరిస్థితుల్లో మేఘాలయ పోలీస్ బృందాలు కాశీ కొండల్లో విస్తృతంగా గాలింపు జరిపాయి. అక్కడున్న గైడ్లను విచారించారు. వివిధ కోణాల్లో కేసు దర్యాప్తు చేసిన తర్వాత హత్యచేయించి కనిపించకుండా పోయిన రఘువంశీ భార్య సోనం మీద అనుమానాలు మొదలయ్యాయి. ఆమె కాల్ లిస్టు మీద దృష్టి పెట్టి విచారణ చేశారు . సోనం ఉత్తరప్రదేశ్లో ఉందని సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లి ఆమెను తీసుకొచ్చారు. హనీమూన్ యాత్రకు బయలుదేరకముందే సోనం ముగ్గురు కిరాయి హంతకులతో మాట్లాడి భర్తను చంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.,
అంతకుముందే హనీమూన్ యాత్రకు పోతున్న కాశీ కొండలకు పంపించింది . వారిచేత కూడా కొండలు ఎక్కే వారిలాగా వేషాలు వేయించింది. మరో వ్యక్తిని గైడ్ అని చెప్పి అక్కడికి తీసుకు వచ్చింది . నాటకీయంగా ఈ నలుగురు కాశీ కొండల దగ్గరే ఉండి అక్కడ వారితో మాట్లాడినట్టు నటించి, ముందు వాళ్ళు పోతుండగా వెనక రఘువంశి , సోనమ్ అనుసరించారు.
ఆ తర్వాత ఒక నిర్మానుష్య ప్రాంతంలో సోనం అద్దెకు తీసుకున్న ముగ్గురు హంతకులు కత్తితో నరికి ఆమె భర్త రఘువంశీని చంపేశారు. శవాన్ని అక్కడ పారవేసి పరారయ్యారు. గైడ్ వేషంలో ఉన్న వ్యక్తి ముగ్గురు కిరాయి హంతకులు పారిపోగా సోనం మాత్రం ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్ళిపోయింది . వేరొకరితో అక్రమ సంబంధం ఉందని ఇందు కోసమే భర్తను పెళ్ళైన వారానికే చంపేసిందని తెలుస్తోంది.

