శిశువుల ఆరోగ్యం వారి మానసిక పరిస్థితి , తదితర విషయాలలో పెన్సిల్వేనియా యూనివర్సిటీ సంచలమైన పరిశోధన చేశారు. తండ్రుల మానసిక ఆందోళన , ప్రవర్తన తండ్రుల మానసిక కుంగుబాటు ఇలాంటివన్నీ కూడా వీర్యం ద్వారా సంక్రమించే డిఎన్ఏ లో మార్పులు తెస్తాయని పరిశోధనలో తేలింది. తల్లి గర్భం దాల్చకముందు తండ్రి ఆందోళన తండ్రి ద్వారా సంక్రమించే వీర్యం జన్యువుల్లో కొంత మార్పు తీస్తుంది . మానసిక ఆందోళన అనేది అనేక విధాలుగా ఆరోగ్యం పై ప్రభావితం చూపిస్తుంది అన్నది ఇప్పటికీ అనేక అధ్యయనాలు చెబుతూనేఉన్నాయి. భార్యాభర్తల కలయికకు ముందు మానసిక వత్తిడి, ఆందోళన మనిషి ఆరోగ్యం పైనే కాదు, అది సంయోగంలో వీర్యం ద్వారా జన్యులలో మార్పులకు కూడా కారణమవుతుందని ఇప్పుడు తేలింది .
జన్యువులలో మార్పు అంటే జన్యువులు పూర్తిగా మారడం కాదు , జన్యువులలో ఆందోళనకు సంబంధించిన పరమాణు కణాలులో ఆర్ ఎన్ ఏ మారుతుంది. ఆందోళన పడినప్పుడు మెదడు విడుదల చేసే రసాయనాలు , డీఎన్ ఏ , కి ఆర్ ఎన్ ఏ కి అనుసంధానంగా ఉండే ప్రోటీనుల్లో మార్పులుతెస్తాయి. . ఈ రసాయనికి మార్పులే జన్యువులు పనిచేసే విధానాన్ని మారుస్తాయి . అందువల్ల తల్లి గర్భం దాల్చే ముందు ,లేదా గర్భం దాల్చిన సమయంలో లేదా గర్భం దాల్చిన ముందు కలయిక సమయంలో తండ్రుల ఆందోళన ఆ తర్వాత పుట్టే బిడ్డ పై ప్రభావితం చూపిస్తుందని , ఆ మానసిక ఒత్తిడి కూడా ప్రభావితం చూపిస్తుందని పరిశోధనలో తేల్చారు. అందువల్ల తండ్రుల మానసిక ఆందోళన తండ్రులు ప్రవర్తన జన్యువుల ద్వారా బిడ్డల ఆందోళన, ఆరోగ్యంపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందన్న విషయంలో దీని ఆధారంగా పరిశోధనలు ఇంకా జరుగుతున్నాయి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

