పదో తరగతి పరీక్షల్లో ఇది కూడా ఓ వింతే . చిత్తూరు జిల్లాలోని రొంపిచర్ల లో జరిగిన సంఘటనలో తండ్రి, కూతురు ఇద్దరు టెన్త్ పరీక్లలు రాశారు. తండ్రికి చదువులో సాయం చేసిన కూతురికి తండ్రి కంటే తక్కువ మార్కులు వచ్చాయి . తన తండ్రి తన కంటే మంచి మార్కులు తెచ్చుకున్నాడని కూతురు సంతోషిస్తుంది. రొంపిచర్ల షబ్బీర్ అనే వ్యక్తి 1995- 96 సంవత్సరంలో టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత పేదరికం కుటుంబ బాధ్యత పైన పడటంతో చదువును కొనసాగించలేక పని చేసుకుంటున్నాడు.
షబ్బీర్ కు సమీనా అని పదహారేళ్ళ కూతురు ఉంది . ఆమె టెన్త్ పరీక్షలు రాసింది. తను పరీక్షలు రాస్తూ 30 ఏళ్ళ క్రితం ఫెయిల్ అయ్యాడు. తన తండ్రి చేత కూడా ఓపెన్ స్కూల్ సిస్టం లో పరీక్షలు రాయించాలని భావించి తండ్రిని ప్రోత్సహించింది. ఇద్దరూ పరీక్ష రాశారు తండ్రికి 316 మార్కులు వస్తే , 309 మార్కులు వచ్చాయి. కూతురు సహకారంతో ప్రోత్సాహంతో పరీక్ష రాసిన తనకే ఎక్కువ మార్కులు వచ్చాయని తండ్రి చెప్తున్నా ,కూతురు కూడా ఆయన కంటే తక్కువమార్కులు తెచ్చుకున్నప్పటికీ తండ్రికి తాను ఇచ్చిన ప్రోత్సాహంతో అతడు పాసైనందుకు సంతోషంతో ఉంది..

