నా కోసమే సాయిదన్సికను దేవుడు కాపాడాడేమో , అంటూ సినీ హీరో విశాల్ ఉద్వేగానికి లోనయ్యాడు. 47ఏళ్ళ విశాల్ 35 ఏళ్ళ సాయి దన్సికను పెళ్లాడుతానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. సాయి దన్సికను చాలా కష్టాల్లో నుంచి దేవుడు కాపాడాడని , బహుశా తనకోసమే అలా చేసాడేమోనని కూడా అన్నారు. గత 15 ఏళ్లుగా ఇద్దరం స్నేహితులుగా ఉన్నాం.. ఇటీవలే ఇద్దరూ దగ్గరయ్యాం.. అప్పుడే తెలిసింది.. నా కోసమే సాయి దన్సికను దేవుడు పుట్టించాడని అంటూ విశాల్ చెప్పాడు. సాయి దన్సిక కూడా తన కష్టాల్లో విశాల్ ఇంటికొచ్చి ఓదార్చాడని , తనను ఇబ్బందులనుంచి బయటేసాడని చెప్పింది.
స్నేహితులుగా ఉన్న తమకు కలిసి జీవితాలను పంచుకోవాలని బుద్దిపుట్టిందని, అందుకే ఇద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పింది.. ఇటీవల కాలంగా విశాల్ ఆరోగ్యంపై పలు వదంతులు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో వేదికల మీద ఆయన అనారోగ్యంగా కనపడ్డాడు. ఒక దశలో పక్కమనుషులను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. మాట్లాడలేని స్థితి కూడా ఉండింది. ఆ తరువాత ఆరోగ్యం కుదుటపడ్డా , ఇటీవల ఒక వేదికపై సొమ్మసిల్లి పడిపోయాడు.. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ , భవిష్యత్తులో తన ఆరోగ్యం దృష్ట్యా , ఒక తోడు తప్పనిసరిగా అవసరమైంది. ఇలాంటి ఆలోచనుంచే 15 ఏళ్ళ స్నేహం ప్రేమ మొగ్గ తొడిగి పెళ్లిగా చిగురించబోతొంది..

