రేపు ఒక ఖగోళ అద్భుతం జరుగనుంది. ఓ పెద్ద గ్రహశకలం భూమిని తాకుతూ గంటకు 24 వేల మైళ్ళ వేగంతో దూసుకుపోనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18, 2025న భూమికి దగ్గరగా వెళ్ళడానికి 2025 FA22 అనే ఆస్టరాయిడ్ అంటే గ్రహశకలం ప్రయాణం చేస్తూ వస్తుంది .ఇది 130 నుంచి 290 మీటర్లు ఉంటుంది. దీనివల్ల భూమికి ఎటువంటి ప్రమాదంలేదు. జ్యోతిష్యశాస్త్రరీత్యాకూడా దీనికి ఎలాంటి విశేషం లేదు. కేవలం ఖగోళ సస్త్ర పరిశోధనలకే దీని గమనం , ఉనికి, ప్రయాణం ఉపయోగపడుతుంది. నాసా మరియు జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ లాంటి సంస్థలు దాని గమనాన్ని రికార్డుచేస్తాయి.
ఈ సంవత్సరం ప్రారంభంలో హవాయిలోని అధునాతన పాన్-స్టార్స్ 2 సర్వే ద్వారా కనుగొనబడిన FA22 ఆస్టరాయిడ్ వ్యాసం 120 మరియు 280 మీటర్ల మధ్య ఉంటుందని అంచనా వేశారు. ఇది 2025లో భూమికి సమీపంలో వచ్చే ఖగోళ సకాలాల్లో ఒకటిగా గుర్తించారు. దాదాపు ఈ గ్రహ శకలం కుతుబ్ మీనార్ అంత ఎత్తులో ఉంటుందని చెబుతున్నారు.నాసా పరిశీలనలు ప్రకారం FA22 గ్రహశకలం సూర్యుని చుట్టూ మధ్యస్తంగా కక్ష్యలో పరిభ్రమిస్తుందని , దాదాపు ప్రతి 185 సంవత్సరాలకు ఒక సూర్య పరిభ్రమణాన్ని పూర్తి చేస్తుందని నిర్ధారించారు. సెప్టెంబర్ 18, 2025న అది భూమికి అతి దగ్గరగా వచ్చినప్పుడు, అనగా ఆ గ్రహశకలం భూమిని దాదాపు 842,000 కిలోమీటర్ల దూరంలో దాటుతుంది –
ఇది చంద్రుని దూరం కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహశకలం మనకు దూరంగానే ఉన్నప్పటికీ ఇది గంటకు దాదాపు 24,127 మైళ్ల వేగంతో ప్రయాణించే FA22 కావడం తో శాస్త్రవేత్తలు ఈ విషయం లో మరింత లోతైన పరిశీలన చేస్తున్నారు . రాడార్ మరియు అధునాతన టెలిస్కోప్‌లతో FA22ని ట్రాక్ చేయడం ద్వారా, శాస్త్రవేత్తలు ఆస్టరాయిడ్ కక్ష్య ల పై మరింత పరిశీలన చేసినట్టు అవుతుంది . అలానే ఆస్టరాయిడ్ లో ఉన్న లో ఉన్న పదార్ధాల ను పరిశీలన చేయడం జరుగుతుంది . ఈ స్థాయి గ్రహశకలాలు ప్రతి దశాబ్దానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే భూమి దగ్గరకు అరుదుగా వెళుతుంటాయి.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

