ఆ హెల్మెట్ ధర దాదాపు..మూడున్నర కోట్ల రూపాయలు . షాక్ తిన్నారా..? అయినా ఇది నిజమే. తలకు పెట్టుకునే హెల్మెట్ మూడున్నర కోట్లు ఏమిటీ అనుకోవద్దు.. అదంతే.. అత్యంత అధునాతన యుద్ధ విమానం F-35 యుద్ధవిమానం పైలెట్ ధరించే హెల్మెట్ ధర ఇది.

ఒక చిన్న హెల్మెట్ లోనే సాంకేతిక ప్రపంచం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన , అధునాతనమైన హెల్మెట్ ఇది. పైలెట్ కు అవసరమైన డేటా మొత్తం హెల్మెట్ ఇస్తుంది. యుద్ధరంగంలో 360 డిగ్రీల వ్యూ ఉంటుంది. రాత్రిళ్ళు స్పష్టంగా చూడొచ్చు.

పైలెట్ కోసం ఈ హెల్మెట్ తయారుచేసేప్పుడు , సంబంధిత పైలెట్ తలను 3D లో స్కాన్ చేస్తారు. ఎలాంటి హెయిర్ స్టైల్ లో అయినా ఫిట్ అవుతుంది. కళ్ళ కదలికను కూడా పీపులో మీటర్ ద్వారా రికార్డ్ చేసి దానికి సరిపోయేవిధంగా హెల్మెట్ చెయ్యాలి. అంటే ప్రతి పైలెట్ కి వేరుగా ఒక్కో హెల్మెట్ తయారుచేయాలి..

