సంచలనం కలిగిస్తున్న మద్యం కుంభకోణం తేనె తుట్టి కదిలింది. ఇప్పుడు వైసీపీలో ఒక్కొక్కరుగా మద్యం కుంభకోణం కలుగులో నుంచి బయటకు వస్తున్నారు. వైసీపీలో తీవ్ర సంచలనం దుమారం లేపిన మద్యం కుంభకోణం అబద్ధమని ఆ పార్టీ నాయకులు ఎంతగా మొత్తుకుంటున్నప్పటికీ నాలుగున్నర ఏళ్ళు పాటు జరిగిన కుంభకోణం నిజమేనని అప్పటి మద్యం శాఖ మంత్రి నారాయణస్వామి చెప్పారు. బాటిల్ ఫర్ క్యాష్ అన్న ప్రాతిపదికన జరిగిన వ్యవహారాలు ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు తాజాగా వైసీపీలో ఓ బాంబు పేలింది . జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం అమ్మకాల విషయంలో నారాయణస్వామి ఓ నిజం బయటపెట్టేసాడు.
చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి జగన్ ప్రభుత్వ హయాంలో ఉపముఖ్యమంత్రి గాను మరియు ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలోనే ఆయన తెలిసే విధానాల రూపకల్పన జరిగిందని ఎవరైనా అనుకుంటే అది పొరపాటే. ఆ విధానాల రూపకల్పన తనకు సంబందం లేదన్నారు. ఇప్పుడు తాజాగా నారాయణస్వామి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో తన పాత్ర లేదని ఇద్దరు వైసీపీ నాయకులు తనను ఇరికించాలని చూస్తున్నారని నారాయణస్వామి అన్నారు . తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొందరు అక్రమంగా సంపాదించి ఉండవచ్చునని కానీ తాను మాత్రం నిజాయితీగానే వ్యవహరించానని చెప్పారు. మద్యం కొత్త పాలసీ ప్రారంభానికి ముందే డిజిటల్ లావాదేవీలు వద్దని ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట కూడా నిజమేనని నారాయణస్వామి ఒప్పుకున్నారు.
ఈ కుంభకోణంలో విచారణ చేపట్టిన సిట్ కు అన్ని విధాలా సహకరిస్తానని ,ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్న సిట్ తనను ఏ ప్రశ్నలు అడిగినా నిజాయితీగా సమాధానాలు చెప్తానని నారాయణస్వామి అన్నారు. నారాయణస్వామి వ్యాఖ్యలు ఇప్పుడు నేరుగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను ఇరికించే విధంగానే ఉన్నాయి. ఇదివరకే ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలను, అర్థం కాని నిధుల బదలాయింపు దారులను విజయసాయిరెడ్డి సిట్ కు పూర్తిగా చెప్పేసినట్టున్నారు. అందుకని సిట్ చకచకా తన పని తాను సాగించింది. సూట్ కేస్ కంపెనీల ద్వారా మద్యం కుంభకోణం లో కమిషన్లు ఎలా దారి మళ్ళించారో కూడా విజయసాయిరెడ్డి ఇదివరకే చెప్పినట్టు వార్తలు ఉన్నాయి. ఈ సూట్ కేస్ కంపెనీలు ఏర్పాట్లు విషయంలో విజయసాయిరెడ్డి కూడా అందే వేసిన చేయి . అప్పట్లో జగన్ తో పాటు 16 నెలలు జైల్లో ఈ సూట్ కేస్ కంపెనీల ఆరోపణలపై విజయ్ సాయి రెడ్డి కూడా ప్రవాస జీవితం గడిపొచ్చారు.

