ఆశయం ఉండాలే కానీ ఆచరణకు మార్గం లేకుండా పోదు . సంకల్పం ఉండాలే గాని అది నెరవేరే దారి లేకపోయినా దారి కనపడుతుంది . ఆఫ్రికాకు చెందిన ఓ నలుగురు అమ్మాయిలు అద్భుతమైన పరిశోధన చేసి ప్రపంచం సాంకేతిక రంగం ఆశ్చర్యపోయెట్టు చేసారు. అది ఏంటో తెలుసా ..? ఒక్క లీటర్ మూత్రం నుంచి ఆరు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసి ,సరఫరా చేసే మార్గం కనుక్కున్నారు. ఒక అద్భుతాన్ని సాధించారు. ఆవిష్కరణలు ,ప్రయోగాలు ,సరికొత్త విధానాలు శ్వేత జాతీయులుకే పరిమితం అని విర్రవీగుతున్న వారికి ఇది ఒక చెంపపెట్టు.

మేధస్సుకు జాతీయతకు సంబంధం లేదని నిరూపించారు. మనుషులలో అంతర్గతంగా ఉన్న ఆలోచన శక్తి ,వివేచనా, విచక్షణ, పరిశోధనాత్మక నైజం వారిని ఈ అద్భుత ప్రయోగానికి పురికొల్పింది. ఇంతకీ ఈ నలుగురు ఆఫ్రికన్ అమ్మాయిలు చేసింది ఏంటో తెలుసా..? ఒక లీటర్ మూత్రాన్ని ఒక జనరేటర్ లో పెట్టి ఎలక్ట్రోలైటిక్ సెల్ ద్వారా హైడ్రోజన్ ను మాత్రమే గ్రహించారు . ఆ తర్వాత ఈ హైడ్రోజన్ ను శుద్ధి చేశారు . దాన్ని ఘనీభవించారు. ఆ తర్వాత దీన్ని జనరేటర్ కు ఇంధనంగా వాడారు .

దాదాపు లీటర్ మాత్రం మూత్రంతో తయారుచేసిన హైడ్రోజెన్ తో ఆరుగంటలపాటు ఆ జనరేటర్ నిరంతరాయంగా పనిచేసింది. ప్రపంచం ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు అందులోనూ విద్యుత్ సమస్యకు ,కాలుష్య సమస్యకు ఇదొక గొప్ప పరిష్కారం అని ఆ నలుగురు అమ్మాయిలు చెప్తున్నారు . విద్యుత్ కొరత సాధారణమైపోయిన కొన్ని ప్రాంతాల్లో , అసలే విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లో ఈ ప్రయోగం గొప్పగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చాలా తక్కువ ధరతో , పర్యావరణానికి ఇబ్బంది లేని విధంగా ఈ సాధనాన్ని రూపొందించారు.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

