దుబాయిలో జరిగిన వైమానిక విన్యాసాలలో భారతీయ తేలికరకం యుద్ధవిమానం తేజాస్ కూలిపోవడంపై మనదేశంలో సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. రక్షణ వ్యవస్థకు సంబందించిన ఒక యుద్ధ విమానం కూలిపోతే , దాన్ని రాజకీయ కోణంలో చూడటం , దానిపై విమర్శలు చేయడం బహుశా ప్రపంచంలో పాకిస్తాన్ లోనే సాధ్యమేమో..? ఎన్ని రాజకీయ స్పర్ధలు, వివాదాలు, విభేదాలున్నా దేశ భద్రత , రక్షణ విషయాల్లో ఏకాభిప్రాయం ఉండాల్సిన చోట ఇలాంటి కువిమర్శలు చోటుచేసుకోవడంపై ఓ మిలిటరీ ఉన్నతాధికారి ఆవేదన వ్యక్తం చేసారు. ఇంతకీ ఆ అధికారి ఎవరో తెలుసా..? మనకు బద్ద శత్రువు అయిన పాకిస్తాన్ వైమానికదళంలో అత్యున్నత స్థాయిలో పనిచేసి రిటైర్ అయిన పెర్సి వర్జి అనే అధికారి. తేజాస్ విమానం ప్రమాదంపై సొషల్మీడియాలో ట్రోల్ల్స్ పై ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
విన్యాసాలలో ఏదైనా జరిగితే ట్రోల్ చేస్తారా ?
ప్రమాదం జరిగిన తీరు బాధాకరమని అన్నారు. వైమానిక విన్యాసాలలో స్టంట్ లు ఉండవని , అవి దేశ రక్షణ వ్యవస్థను, పైలెట్ల ధైర్యాన్ని, నైపుణ్యాన్ని , సమర్థతను, ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే నైపుణ్యానికి నిదర్శనమని అన్నారు. దేశం కోసం చేసే ఈ విన్యాసాలలో దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే దాన్ని ట్రోల్ చేస్తారా అని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ ప్రమాదంలో చనిపోయింది ఒక పైలెట్ కాదు. ఆకాశాన్ని కాపాడే రాజు. ఒక రక్షకుడు. ఇలాంటి వాటిని ట్రోల్ చేయడం దేశభక్తికాదు. అది మానసిక దౌర్బల్యం, దివాళాకోరుతనం. మనం సిద్ధాంతాలమీద , విధానాలమీద ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, విమర్శలు చేసుకోవచ్చు యుద్ధవీరులు ఎప్పుడూ వీరులకు వందనం సమర్పిస్తారు. ఏ దేశం వీరుడైనా సరే , ఒక విన్యాసంలో ప్రాణాలు కోల్పోతే అతడి సాహసాన్ని , శౌర్యాన్ని కీర్తించాలి.. అంతేగానీ హేళన చేయడం దేశభక్తి కాదు.. అది ఏదేశ పౌరుడైనా, మిలిటరీ ఉద్యోగి అయినా మంచి సంప్రదాయంకాదు, సభ్యత అంతకంటే కాదని గట్టిగా గడ్డిపెట్టాడు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

