పోలీస్ శాఖలో నేరాలను అరికట్టేందుకు వాహనాలు పాత్ర ప్రముఖమైనది . అనేక దేశాల్లో వీటి ప్రాముఖ్యతను గుర్తించి పోలీస్ శాఖకు అత్యంత అధునాతనమైన ఆయుధాలను వాహనాలను ఇచ్చి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పుడే కాదు వాహనాలు లేని కాలంలో కూడా అప్పటి రాజులు ,ఆ తర్వాత వలస పాలకులు వీళ్ళందరూ కూడా తమ భద్రత అవసరాలకు, ప్రజలరక్షణకు గుర్రాల మీద భటులను పంపి రక్షణ మరియు శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేసేవారు. ఆ తర్వాత సాంకేతిక ప్రగతి పెరిగే కొద్దీ పోలీసు శాఖలోకి వాహనాలు ప్రవేశించి ఇప్పుడు దాదాపుగా ఎస్ఐ స్థాయి మొదలుకొని వివిధ రకాల వాహనాలు వినియోగానికి అవకాశాలు ఉన్నాయి.
అయితే ప్రపంచంలో అతి పటిష్టమైన పోలీసు వ్యవస్థ అమెరికాలో ఉందని అనుకుంటారు. కానీ అది నిజం కాదు . దుబాయ్ లో పోలీసు వ్యవస్థకు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత అత్యంత ఆధునిక ఆయుధాలు, వాహనాలు సమకూర్చారు. దుబాయిలో పోలీసులకు ప్రపంచంలో ఎక్కడా లేనంత ,ఏ దేశం కూడా ఇవ్వనంత ఆధునికమైన టెక్నాలజీతో కూడిన కార్లను ఆ ప్రభుత్వం సమకూర్చింది.
బుగాటి కారు గంటకి 417 కిలోమీటర్ల స్పీడు పోగలదు . దీని ధర పదిన్నర కోట్లు. ఇలాంటి కార్లే కాదు ,అత్యంత అధునాతనమైన స్ట్రైకింగ్ తుపాకులు మరియు సెర్చింగ్ పరికరాలు .. ఇలా ఎన్నింటినో దుబాయ్ ప్రభుత్వం తమ పోలీస్ దళాలకు సమకూర్చింది . కార్లోకూర్చునే పోలీస్ పోలీస్ కు తన చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో దాదాపు 25 కిలోమీటర్ల పరిధిలో ఏం జరుగుతుందో తెలుసుకునే అవకాశం ఉన్న సాంకేతిక కూడా దుబాయ్ పోలీస్ కార్లకు ఉంటుంది.

