మనిషికి రుచి సంగతి ఎలా ఉన్నా అభిరుచి ఉంటే వాటిని తీర్చుకోవాలన్న ఆరాటం కూడా ఉండాలి .. ఆ అభిరుచులే ఒక్కోసారి వినూత్న ప్రయోగాలకు దారి తీస్తాయి .సాహసాలకు కూడా కారణం అవుతాయి . పశ్చిమబెంగాల్లో నవాబ్ షేక్ నబాబ్ అనే ఒక వ్యక్తికి డబుల్ కాట్ బెడ్ లాగా ఒక కారు తయారు చేసుకోవాలని ఆలోచన కలిగింది . తన ఇంట్లో డబుల్ కాట్ బెడ్ ని అలా చేసేస్తే పోతుంది కదా అన్న ఉద్దేశం కలిగింది. దీంతో తన ఇంట్లో డబుల్ కాట్ బెడ్ కు కింద చక్రాలు పెట్టేసాడు. దానికి ఇంజిన్ , స్టీరింగ్ కూడా పెట్టేశాడు. డ్రైవింగ్ క్యాబిన్ కూడా తయారు చేసుకున్నాడు.
పాపం ఇలాంటి కారు రూపొందించేందుకు నబాబ్ కి 72 లక్షల రూపాయలు అయింది . ఈ మొత్తం తన భార్య నగలు అన్ని సమకూర్చుకున్నాడు . ఎలాగైతేనేమీ రెండేళ్లు కష్టపడి డబుల్ కాట్ బెడ్ కారు తయారు చేసుకున్నాడు . కారు స్టీరింగ్ దాన్ని ఎలాగైనా తిప్పగల నేర్పుతో ఈ వాహనాన్ని రోడ్డు మీదకు తీసుకొచ్చేశాడు. డబల్ కాట్ బెడ్ కారు రోడ్డు మీద పరుగులు తీయడంతో అనేక మంది సెల్ఫీలు తీసుకోవడం ,దాన్ని వీడియోలు తీయడం జరిగిపోయింది.
ఇది తన యూట్యూబ్లో పెట్టుకున్న నబాబ్ కి దీనికి 68 మిలియన్ వ్యూస్ కూడా వచ్చేసాయి. అయితే నబాబ్ డబల్ బెడ్ రూమ్ కారు రోడ్లమీద పరుగులు తీసి న్యూసెన్స్ క్రియేట్ చేశాడని రవాణాశాఖ అధికారులు ,పోలీసులు అతడి మీద కేసులు పెట్టి భారీగానే ఫైన్ కూడా వేసేశారు . సాహసం చేయరా డింభకా ఫలితం ఏదైతేనేమి అన్న సామెత నిజమేనేమో అనిపిస్తుంది పాపం నబాబ్ ని చూస్తే .

