రెండుసార్లు వాయిదా పడిన తర్వాత ఎట్టకేలకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారు అయింది. నెల్లూరు సెంటర్ జైల్లో ఉన్న మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించేందుకు గతంలో రెండు సార్లు ప్రయత్నాలు చేశారు. అయితే హెలిపాడ్ విషయంలో వివాదం రావడంతో ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రభుత్వం హెలిపాడ్ ని సెంట్రల్ జైలుకు పక్కనే ఏర్పాటుకు అనుమతి ఇవ్వడంతో స్థానిక వైసీపీ నాయకులు దానికి ఒప్పుకోలేదు. హెలిపాడ్ సెంట్రల్ జైలుకు దూరంగా ఉండాలని కోరింది. అలాఉంటే పరామర్శకు వచ్చే జగన్ కోసం ప్రజలను సమీకరించే అవకాశం ఉంటుంది. దీన్ని హైప్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాకాకుండా రాజకీయంగా ఉపయోగంలేకుండా జైలు పక్కనే హెలిపాడ్ ఎందుకని నిరాకరించి జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు.
జనావాసాలకు దగ్గరగా ఉండే ప్రాంతంలో జగన్ హెలికాప్టర్ దిగితే ఆ ప్రాంతానికి జైలుకు మధ్య దూరం ఉంటే దారిలో కాన్వాయ్ పోయేప్పుడు జన సమీకరణతో జనంలో మధ్యలో పోవాలని ఉద్దేశంతోనే ఈ పర్యటన అప్పట్లో రద్దయింది . ఇప్పుడు సీన్ మారింది. కాకాణి గోవర్ధన్ రెడ్డి పరామర్శకు తోడు మాజీ మంత్రి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి విధ్వంసం కూడా తోడైంది. దీంతో జైలు పక్కనే హెలిపాడ్ కి వైసిపి నేతలు ఒప్పుకున్నారు.
కాకాణి గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైల్లో పరామర్శించి అక్కడి నుంచి నెల్లూరు నడిబొడ్డులో ఉన్న ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ప్రసన్నకుమార్ రెడ్డిని పరామర్శిస్తారు. అంటే ఆయనకు ఇప్పుడు జన సమీకరణకు అవకాశం దొరికింది. జనం మధ్యలో రోడ్డుమీద యాత్రకు అనుమతి లభించింది . దీంతో నల్లపరెడ్డి ప్రసన్న విధ్వంసం కలిసి వచ్చిన అవకాశం కావడంతో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఖరారైంది . దీంట్లో కొసమెరుపు ఏంటంటే గతంలో వైసిపి నేతలు వద్దన్న హెలిపాడ్ సెంట్రల్ జైలు పక్కనే దిగుతున్నారు. కాకపోతే అదనంగా బోనస్ ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వచ్చేటప్పుడు ఆ నాలుగు కిలోమీటర్ల దూరం జన సమర్థంగా ఉన్న ప్రాంతం నుంచి వస్తారు. అప్పుడు అక్కడ జనాన్ని సమీకరించుకుని ఒక రాజకీయ జాతర సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్యటన ఖరారు అయిపోయింది.

