శునకాలు యజమాని పట్ల విశ్వాసానికి ,ప్రేమకు నిదర్శనాలు. ఒక్కో దఫా కన్న బిడ్డల కంటే కుక్కలే యజమానులు కోసం ప్రాణత్యాగం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. అలాంటిదే మధ్యప్రదేశ్లో ఓ జర్మన్ షెపర్డ్ శునకం తన యజమానిని పులి దాడి నుంచి కాపాడేందుకు పులితో పోట్లాడి ప్రాణాలు కోల్పోయింది. నిజంగా విశ్వాసానికి, యజమాని పట్ల దాని ప్రేమకు ,త్యాగానికి ఇదొక నిదర్శనం . శివం బర్గీయ అనే ఓ వ్యక్తి తన వ్యవసాయ క్షేత్రానికి పోతూ శునకాన్ని కూడా వెంటబెట్టుకుపోయారు . ఆ వ్యవసాయ క్షేత్రం టైగర్ రిజర్వ్ సమీపంలోని ఉంది .
తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన పనులు చూసుకుంటుండగా ఆకస్మాత్తుగా పెద్దపులి అతనిపై దాడి చేసింది . దీన్ని గమనించిన అతడి పెంపుడు కుక్క జర్మన్ షెఫర్డ్ పులి కంటే వేగంగా ఆ పులి మీద దూకి తన యజమాన్ని కాపాడేందుకు పోరాటం చేసింది. యజమానిని వదిలేసిన పులి కుక్కతో పోట్లాడి పారిపోయింది . ఈ పోరాటంలో జర్మన్ షెఫర్డ్ చనిపోయింది. యజమానిని కాపాడి చనిపోయిన జర్మన్ షెఫర్డ్ త్యాగం నిజంగా విలువ కట్టలేనిది .
యజమానిపై దాడిని అడ్డుకున్న జర్మన్ షెఫర్డ్ను ఆ పులి నోట కరుచుకుని అడవిలోకి పారిపోయేందుకు ప్రయత్నించింది. అయితే జర్మన్ షెఫర్డ్తో పోరాటం చేసింది. చివరకు శునకాన్ని తీసుకుపోలేక, వదిలేసి పులి అడవుల్లోకి పారిపోయింది . తీవ్ర గాయాలతో ఉన్న తన శునకాన్ని యజమాని హడావుడిగా వెటర్నరీ హాస్పిటల్కు తీసుకెళ్లాడు . అక్కడ దానికి చికిత్స చేస్తుండగానే అది ప్రాణాలు వదిలింది. ఇప్పుడు యజమాని కుటుంబం దుఃఖానికి శోకానికి అంతం లేదు..

