శరీరం సహకరించడం ఆపేసినప్పుడు, కోలుకునే అవకాశం లేనప్పుడు,తనపై చికిత్సలు చేయవద్దని ఒక అనాటమీ ప్రొఫెసర్ వీలునామా రాసింది. ఈ వీలునామాలో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో గుట్టు , మోసం, దగా ఎలాంటిదో చెప్పకనే చెప్పింది. అదెలాగో చూడండి.పేషేంట్ ఐసియులో ఉంది.వెంటిలేటర్ పై ఉంచాం.. ఇది మొదటిమాట.. 72 గంటలు గడిచాక చెబుతాం..ఇది రెండో మాట.. శరీరం మందులకు సహకరించడంలేదు .ఇది మూడో మాట , బిపి, హార్ట్ బీట్ నార్మల్ గా ఉంది. మరో 72 గంటలు చూద్దాం.. ఇది నాలుగో మాట.. అప్పటికి 45 లక్షలకుపైగా ఐసియూకి బిల్లు పేచేసి ఉంటారు. గట్టిగా అడిగితె , ఏంచేద్దామండీ బాడీ సహకరించడంలేదు , కానీ మా ప్రయత్నం మేముచేస్తాం.ఇలా పేషేంట్ల బంధువులు, ఆప్తులు అన్నీ అమ్ముకుని ఐసియూకి డబ్బులు కట్టి చివరకు శవాన్ని ఇంటికి తీసుకెళ్లే సందర్భాలు మనదేశంలో కోకొల్లలు. ఇది మనదేశంలో బిగ్గెస్ట్ మెడికల్ ఫ్రాడ్, ..
అయినా ఈ దోపిడీ కొనసాగుతూనేఉంది. ఈ సందర్భంగా ముంబైలోని జీఎస్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ డాక్టర్ . లోపా మెహతా తన ఏమి రాసిందో తెలిస్తే వెంటిలేటర్ మోసం తెలుస్తోంది. అక్కడ ఆమె అనాటమీ విభాగం అధిపతిగా పనిచేశారు. ఆమె తన 78వ ఏట ఓ లివింగ్ విల్ రాసుకున్నారు. అందులో ఆమె స్పష్టంగా ఇలా పేర్కొన్నారు. శరీరం సహకరించడం ఆపేసినప్పుడు, కోలుకునే అవకాశం లేనప్పుడు, నాపై చికిత్సలు చేయవద్దు. వెంటిలేటర్లు వద్దు, ట్యూబులు వద్దు, ఆసుపత్రుల అనవసరమైన హడావిడి వద్దు. నా చివరి క్షణాలు ప్రశాంతంగా గడవాలి. అక్కడ చికిత్సల కోసం చేసే మొండి పట్టుదల కన్నా వివేకానికి ప్రాధాన్యత ఉండాలి.”డా. లోపా ఈ పత్రాన్ని రాయడమే కాకుండా, మరణం గురించి ఒక పరిశోధనా పత్రాన్ని కూడా ప్రచురించారు. అందులో ఆమె మరణం అనేది సహజమైన, నిశ్చితమైన, మరియు జీవశాస్త్ర ప్రక్రియ అని స్పష్టం చేశారు.
శరీరం అనేది నిరంతరం పనిచేసే యంత్రం కాదు. అది ఒక పరిమిత వ్యవస్థ, దీనికి ఒక నిర్దిష్టమైన ప్రాణశక్తి ఉంటుంది. ఈ శక్తి ఏదో ఒక నిల్వ చేయబడ్డ ట్యాంకు నుంచి లభించదు, సూక్ష్మ శరీరం నుంచి వస్తుంది. ఈ సూక్ష్మ శరీరం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించేదే, కానీ కనిపించనిది. మనసు, బుద్ధి, జ్ఞాపకాలు మరియు చైతన్యం. ఇవన్నీ కలిపి ఏర్పడిన ఒక వ్యవస్థ ఇది.ఈ సూక్ష్మ శరీరం ప్రాణశక్తికి ఒక ప్రవేశ ద్వారం లాంటిది. ఈ శక్తి మొత్తం దేహంలో విస్తరించి, శరీరాన్ని సజీవంగా ఉంచుతుంది. గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ, ఆలోచనా శక్తి ఇవన్నీ దాని ఆధారంపైనే నడుస్తాయి. కానీ, ఈ శక్తి అపరిమితం కాదు. ప్రతి శరీరంలో దీనికి ఒక నిర్దిష్ట పరిమాణం ఉంటుంది. ఒక యంత్రంలో అమర్చిన ఫిక్స్డ్ బ్యాటరీ లాగా దాన్ని పెంచలేము, తగ్గించలేము.శరీరంలోని ఈ శక్తి అయిపోయినప్పుడు, సూక్ష్మ శరీరం దేహం నుంచి వేరు అవుతుంది. ఆ క్షణమే దేహం కదలకుండా అవుతుంది.
ఇది శరీర అంతర్గత లయ అని ఆమె వెల్లడించారు. ఇది గర్భంలోనే మొదలవుతుంది, పూర్తయి మరణానికి చేరుకుంటుంది. ఈ శక్తి ప్రతి క్షణం ఖర్చవుతూనే ఉంటుంది. ప్రతి కణం,ప్రతి అవయవం దాని జీవితకాలాన్ని పూర్తి చేసుకుంటుంది. మరియు మొత్తం దేహం యొక్క “కోటా” పూర్తయినప్పుడు, శరీరం శాంతంగా ఉంటుంది. మరణం యొక్క క్షణం గడియారంతో కొలిచేది కాదు. అది ఒక జీవశాస్త్ర సమయం. ఇది ప్రతి ఒక్కరికీ వేర్వేరుగా ఒక్కొక్కలా ఉంటుంది.. కొందరి జీవితం 35 ఏళ్లలో పూర్తవుతుంది, మరికొందరిది 90 ఏళ్లలో. కానీ ఇద్దరూ తమ పూర్తి ప్రయాణాన్ని పూర్తి చేస్తారని చెప్పారు. .డా. లోపా వాదన ప్రకారం ఆధునిక వైద్యశాస్త్రం మరణాన్ని నివారించడానికి మొండి పట్టుదల పట్టినప్పుడు, కేవలం రోగి శరీరం మాత్రమే కాదు, మొత్తం కుటుంబం అలసిపోతుంది. ఐసీయూలో ఒక నెల శ్వాస కోసం పెట్టే ఖర్చు కొన్నిసార్లు జీవితకాల పొదుపును నాశనం చేస్తుందని అన్నారు. అర్థమైందా , ఆమె చెప్పిన దానిలో నిజం..

