డ్రగ్స్ పై అవగావాహన కల్పించే డాక్టర్ డ్రగ్స్ కొనుగోలుచేస్తూ రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. హైదరాబాద్ లో ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్ ఒమేగా హాస్పిటల్స్ సిఇఓ గా ఉన్న డాక్టర్ చిగురుపాటి నమ్రత డ్రగ్స్ కొంటుండగా పోలీసులకు చిక్కిపోయింది. చేసారు. 50 గ్రాముల కొకైన్ డ్రగ్ కోసం ఐదు లక్షలరూపాయలు వంశ థక్కర్ అనే వ్యక్తికీ ఆన్ లైన్ లో పంపింది. అతడు బాలకృష్ణ అనే వ్యక్తి ద్వారా డెలివరీ చేసాడు. బాలకృష్ణ డ్రగ్స్ తెచ్చి ఇస్తున్నప్పుడు పోలీసులు వలపన్ని పట్టేశారు.
బాలకృష్ణ డ్రగ్స్ అమ్మే వంశ థక్కర్ కి ఏజెంట్ గా ఉంటున్నాడు.పోలీస్ విచారణలో డాక్టర్ నమ్రత డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఒప్పుకుంది. ఏడాదిలోనే డ్రగ్స్ పై 70 లక్షల రూపాయలు ఖర్చుపెట్టినట్టు చెప్పింది. ఈ కేసులో రాయదుర్గం పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. పేరుపొందిన పెద్ద హాస్పిటల్ సిఇఓ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడటంతో , ఈ మాఫియా గుట్టు రట్టు చేసేందుకు పోలీస్ ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించింది..

