అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మృతులను గుర్తించడం కష్టంగా మారింది. భారీ విస్ఫోటనం సంభవించడంతో ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. అందువల్ల మృతదేహాల గుర్తింపు వీలుకాని పరిస్థితి. దీంతో అధికారులు మృతులను గుర్తించేందుకు డిఎం ఏ పరీక్షలు చేస్తున్నారు. ప్రమాద స్థలంలో కనుగొంటున్న మాంసం ముద్దలు, ఎముకలు , పళ్ళు , పుర్రె ఇలాంటివి రెఫెరెన్స్ శాంపిల్స్ గా తీసుకొని , ప్రమాదంలో చనిపోయిన వారి రక్తసంబంధీకుల నమూనాలతో డిఎన్ ఏ తో పోల్చుతున్నారు.
ఇవి సరిపోలితే ఆ మాంసం ముద్దలు, ఎముకలను ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో వేసి అంత్యక్రియలకు ఇస్తారు. ఇదొక అత్యంత విషాదకరమైన ఘోరం. ప్రమాదంలో చనిపోయిన వారి మృత దేహాలను కూడా చూసుకోలేని దయనీయమైన పరిస్థితి. దీంతో అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో DNA టెస్టులు చేస్తున్నారు. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అహ్మదాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
ఈ విమాన ప్రమాదంపై విదేశీ నిపుణుల కమిటీలు కూడా దర్యాప్తునకు రానున్నాయి. అమెరికానుంచి బోయింగ్ కంపెనీ తరపున కూడా విచారణ కమిటీ వస్తోంది. బ్రిటన్ నుంచి కూడా దర్యాప్తు బృందం వస్తోంది. మరోవైపు ఈ ప్రమాదం వెనుక విద్రోహ చర్య ఏమైనా ఉందా అన్న దిశగాకూడా కేంద్ర దర్యాప్తు బృందాలు ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. దాదాపు 30 ఏళ్ళ తరువాత ఇలాంటి ఘోర ప్రమాదం మన దేశంలో జరగడం విచారకరం. ప్రపంచంలో ఇటీవలకాలంలో ఇంత దారుణ ప్రమాదం జరగలేదు.

