దిత్వా’ తుఫాన్ తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు కదులుతోంది ..నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో ‘దిత్వా’ తుపాను తీవ్రంగా ఉంది. ప్రస్తుతానికి ఇది కారైకాల్ కి 220 .,పుదుచ్చేరికి 330 చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. గడిచిన 6 గంటల్లో 7కి.మీ వేగంతో కదిలిన తుపాన్ రేపు తెల్లవారుజామున తీవ్రవాయుగుండంగా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో శనివారం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి.
ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల,పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీచేశారు. తమిళనాడులో భారీ వర్షాలు దెబ్బకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాలు వరదమయమయ్యాయి. నేడు, రేపు దక్షిణ, కావేరీ డెల్టా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో తంజావూరు, అరియలూర్, పెరంబలూర్, పుదుకొట్టె, నాగపట్నం తదితర జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు అధికారులు సెలవులు ప్రకటించారు. .ఆంధ్రప్రదేశ్ లో దక్షిణకోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

