వచ్చే నెల ఒకటో తేదీ నుంచి కొన్ని ఫోన్ నంబర్లకు యుపిఐ , ఫోన్ పే సేవలు నిలిచిపోనున్నాయి. దేశ వ్యాప్తంగా పల్లెలు మొదలు పట్టణాలవరకు 80 శాతం మంది ఆన్ లైన్ ద్వారానే నగదు తీసుకోవడం, చెల్లించడం చేస్తున్నారు. మొబైల్ ఇప్పుడు కటిక పేదవాడికి కూడా ఉండటంతో ఆన్ లైన్ నగదు బదిలీ విపరీతంగా పెరిగిపోయింది. ఫోన్ పే ఒక్క నిమిషం పనిచేయకపోతే గందరగోళం పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెల ఒకటో తేదీ నుంచి కొన్ని ఫోన్ నంబర్లకు ఆన్ లైన్ లావాదేవీలు ఆపేస్తున్నట్టు ప్రకటించారు.

అలాంటి నంబర్లతో లింక్ అయినా బ్యాంకు అకౌంట్లను కూడా సస్పెండ్ చేస్తారట. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా ఆదేశాలమేరకు ఈ చర్య తీసుకుంటున్నారు. గూగుల్ పే , ఫోన్ పే ,పేటీఎం కూడా ఆ నంబర్లకు సేవలు నిలిపేస్తాయి. బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయిన ఫోన్ నంబర్లు 90 రోజులకు మించి వాడకంలో లేకపోతే , ఆ నంబర్లకు సంబందించిన అన్నిరకాల నగదు లావాదేవీలు చేసే అవకాశాన్ని నిలిపేస్తారు. ఏ ఫోన్ నంబర్ల నుంచి ఇక ఎటువంటి లావాదేవీలు ఉండవు. బ్యాంక్ అకౌంట్లకు, డిజిటల్ పేమెంట్ అకౌంట్లకు లింక్ చేసి కూడా , 90 రోజులకు మించి ఆ నంబర్లు పనిచేయకుండా ఉంటే అలాంటి నంబర్లతో లింక్ అయిన అకౌంట్లు ఆపేస్తారు..

