సెలవు దినాలు కావడంతో తిరుమల భక్తులతో పోటెత్తుతొంది. అదేవిధంగా గంటల తరబడి క్యూలో ఉన్న భక్తులు దేవుడి దర్శనానికి అరగంట ముందే ఓపిక నశించి గొడవలకు దిగుతున్నారు. తిరుమల ఆలయంలో మహాద్వారం వద్ద క్యూలైన్లో వస్తున్న భక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరినొకరు తోసుకుంటూ ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో పోలీసులు , ఆలయ భద్రతా సిబ్బంది. జోక్యం చేసుకుని ఘర్షణ నివారించారు.
తిరుమలలో చాంతాడంత క్యూలైన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వస్తున్నా భక్తులతో రద్దీ ఎక్కువగా ఉంది. నిన్నటి రోజునే 84 వేలమంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారంటే , కొండమీద భక్తుల రద్దీ అర్ధం చేసుకోవచ్చు. క్యూ లైన్లలో ఎక్కువసేపు ఉండాల్సిన అనివార్య పరిస్థితుల్లో భక్తులు సహనం కోల్పోయి ఇలా తరచూ వాదులాటలకు, ఘర్షణ లకు దిగడం పరిపాటి అయింది.

