మనదేశంలో పెళ్లి కాని మగవాళ్లు ఎక్కువైపోతుంటే, చైనాలో పెళ్ళికాని ఆడపిల్లలతో ఇబ్బందిగానే ఉంటుంది. తల్లిదండ్రులు పెళ్లి కాని ఆడపిల్లలకు అబ్బాయిల కోసం మ్యారేజ్ మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నారు. మనదేశంలో మాదిరి పెళ్లిళ్ల పేరయ్యలు, మ్యారేజ్ బ్యూరోలు ఇలాంటివి చైనాలో ఉండవు . అక్కడ నగరాల్లోని కొన్ని ప్రధాన కూడళ్లలో పెళ్లి కాని ఆడపిల్లలు వివరాలు రాసి, ఫొటోలతో స్లిప్పులు పెడతారు. వీటిని చైనా భాషలో షెన్గ్ ను అంటారు .చైనాలో 27 ఏళ్లు దాటిపోయిన పెళ్లి కాని అమ్మాయిల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది .
చైనా సాంప్రదాయంలో పెళ్ళికూడా చాలా ప్రధాన అయింది . అయితే మ్యారేజ్ మార్కెట్లో పేర్లు పబ్లిక్ చేసే ఈ ఈ అమ్మాయిలు 70 శాతం వరకు ఉన్నత చదువులు చదివిన వారు . జీవితంలో బాగా స్థిరపడ్డవారు. తమ అనుకున్న లక్ష్యాలను సాధించిన వారు. ఈ ప్రయత్నాల్లో వారు పెళ్లి చేసుకోవడం ఆలస్యం చేసి లేదా పెళ్లి చేసుకోవడానికి నిర్లక్ష్యం చేసి సంసార జీవితాన్ని మరిచిపోయారు . అందువల్లనే ఇప్పుడు లేటు వయసులో పెళ్ళంటూ పోతుంటే అబ్బాయిలు మాత్రం అమ్మాయిలు వయసు 27 దాటితే తమకు వద్దని తప్పుకుంటున్నారు.
అయితే వదిలేసిన మహిళలు అంటే లెఫ్ట్ ఓవర్ ఉమెన్ అన్న పదాన్ని ఈ పెళ్లికాని పిల్లలు ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పదం అవమానకరంగా ఉందని వేరే పదాన్ని కనుగొని చెప్పండి అంటూ ఉద్యమిస్తున్నారు. చైనాలో మహిళలకు చదువు కంటే ముందు పెళ్లి, సంసారం, తల్లి బాధ్యత ఇలాంటివి ప్రాథమిక లక్ష్యాలుగా నిర్దేశించుకుంటారు. 27 ఏళ్ళు పూర్తైన అమ్మాయిలు తమకొద్దని అబ్బాయిలు చెబుతున్నారు. అందువల్లనే అమ్మాయిలకు అబ్బాయిలు దొరకడంలేదు..

