ఇది ప్రజాస్వామ్యయుగం . రాజులు రాజ్యాలు అంతరించిపోయాయి. గతంలో చట్టాలు నిబంధనలు ఎన్ని ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ చాలా దేశాల్లో మార్పులు వచ్చాయి . అలాగే దుబాయ్ కూడా ఇప్పుడు నాగరిక సమాజంలో ఒక భాగం అయింది. ప్రపంచంలో ప్రగతి పదం వైపు దూసుకుపోతున్న దేశాల్లో అగ్రస్థానంలో నిలబడింది. అనేక విషయాల్లో ముందంజలో ఉన్న దుబాయిలో ఒక వినూత్నమైన మంచి కార్యానికి శ్రీకారం చుట్టారు.
దుబాయ్ ఎడారి ప్రాంతం కావడంతో ఎండల్లో మలమల మాడాల్సిన పరిస్థితి. అందుకని దుబాయిలో ఫుడ్ డెలివరీ బాయ్ ల కోసం ప్రత్యేకంగా 40 ఏసి రెస్ట్ రూమ్ లు అక్కడక్కడ ఏర్పాటు చేశారు. ఫుడ్ డెలివరీ సమయంలో ఉష్ణతాపాన్ని ,ఎండ ప్రభావాన్ని తట్టుకోవడం చాలా కష్టం .
అందుకని ఉపశమనం కోసం అక్కడక్కడ ఏసీ రెస్ట్ రూమ్ లో మంచినీటి సౌకర్యం, ఓరల్ ఫ్లూయిడ్స్ ,ఇలాంటివి ఏర్పాటు చేసి పెట్టారు . అవసరమైతే కాసేపు పడుకునేందుకు పడకలను.. ఇవన్నీ కూడా పెట్టారు. ప్రథమ చికిత్స నిమిత్తం అవసరమైన మందులు కూడా పెట్టారు. డెలివరీ బాయ్స్ కోసం ఇలాంటి ఆలోచన చేయడం నిజంగా అభినందనీయమే.

