రోడ్డు ప్రమాదాలు సంభవించే సమయంలో దెబ్బ తిన్న వాహనాలకు దొంగల బెడద ఎక్కువైంది. ప్రమాదానికి గురైన వాహనాల యజమానులు లేదా ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు గాయాలు లేదా ఇతరత్రా కారణాల వలన వాహనాన్ని వదిలేసి పోతారు. హాస్పిటల్లో చికిత్సకు లేదా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వస్తారని వాహనం వదిలేసి పోతారు. ఇది దొంగలకు బాగా అనుకూలమైంది. ప్రమాదం గురైన వాహనాల్లో టైర్లు ,సీట్లు లేదా ఇతరత్రా విలువైన సామాగ్రిని తీసుకెళ్లి పోతున్నారు. ఈ దృశ్యం హైవే మీద చాలా వాహనాలకు సంబంధించిన ప్రమాదాల్లో కనపడే నిత్య సత్యం.
టైర్లు రిమ్ములు, సీట్లు రెండు రోజుల తర్వాత కనపడవు
ప్రమాదం జరిగే నాటికి ఉన్న టైర్లు రిమ్ములు, సీట్లు కారులో విలువైన ఇతర యంత్ర పరికరాలు ఇవేవీ కూడా రెండు మూడు రోజుల తర్వాత అసలు కనపడవు. లేదంటే రాత్రికి రాత్రి మాయమైపోతాయి. హైవే మీద ఇందుకోసం ఓ ప్రత్యేక ముఠా ఉన్నట్టు దీన్నిబట్టి అర్థం అవుతుంది . ప్రమాదానికి గురైన వాహనాలను టార్గెట్ చేసుకొని వారు ఇలాంటి చోరీలకు పాల్పడుతుంటారని స్పష్టంగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో బద్వేల్ హైవేపై ప్రమాదాల శాతం కూడా పెరిగింది. చాలా వరకు ప్రమాదాలు గేదెలు లేదా ఇతర ఇతర పశువులు అడ్డం రావడంతోనే జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని నివారించగలిగితే ఈ హైవేపై చాలా వరకు ప్రమాదాలు కూడా తగ్గిపోతాయి.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

