22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఆశయంకోసం నాలుగేళ్లుగా సైకిల్ మీదనే

ఓ స్నేహితుడి మరణం అతని ఒక ఆశయం వైపు నడిపించింది . ఆ స్నేహితుడు మరణించిన పరిస్థితులు ,అతనిలో ఒక అవగాహన ,ఆలోచన, పట్టుదల, సంకల్పాన్ని పెంచాయి . ఆ సంకల్పమే గత నాలుగేళ్లుగా అతను ఎడతెరిపి లేకుండా, ఆగకుండా , ఆపకుండా చేస్తున్నాయి. అతడు ఓ ఆశయం కోసం సైకిల్ యాత్ర చేపట్టాడు . తమిళనాడుకు చెందిన కే ముత్తు సెల్వన్ అనే వ్యక్తి 2021 సంవత్సరంలో డిసెంబర్ నెల 21వ తేదీన తన సైకిల్ యాత్ర ప్రారంభించాడు.

కరోనా సమయంలో తన స్నేహితుడు ఆక్సిజన్ అందక చనిపోయాడు. దీంతో అతడిలో ఒక సంకల్పం కలిగింది . ఆధునిక యుగంలో పారిశ్రామికరణ నేపథ్యంలో అడవులు కూడా నగరాలైపోతున్న దశలో ,చెట్లని నరికేస్తున్న దశలో, ఆక్సిజన్ కొరత భావితరాలను తీవ్రంగా బాధిస్తుందని అర్ధం చేసుకున్నాడు. ఇది అనేక రకాల జబ్బులకు దారితీస్తుందని అతనిలో ఒక ఆలోచన కలిగింది . అందుకే చెట్లు పెంపకానికి ఒక అవగాహన కల్పించేందుకు నాలుగేళ్లుగా సైకిల్ యాత్ర చేపట్టాడు. ఇప్పటివరకు 23 రాష్ట్రాలలో 560 జిల్లాల్లో పర్యటన చేశాడు .

దాదాపు మూడు వేలకు పైగా తాలూకా కేంద్రాలలో చెట్లు నాటమని , పెంచమని ప్రచారం చేశారు . అతను ఇప్పటివరకు 27,600 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. 1502 సార్లు తన సైకిళ్లకు టైర్లు మార్పిడి చేశారు . ఒక సదాశయం కోసం ఒక సంకల్పంతో చేసిన ఈ యాత్రలో 8 దఫాలు ప్రమాదాలకు గురయ్యాడు. 19 సంఘటనలో అతడికి కాళ్ల కండరాలకు వ్యాధి వచ్చింది. అయినా సంకల్పాన్ని వీడకుండా, ప్రమాదాలు జరిగినా తన ప్రయాణాన్ని ఆపలేదు . అలాగే కొనసాగించాడు . ఇప్పటివరకు నాలుగు లక్షల 55వేల మొక్కలు నాటాడు, నాటించాడు. ఇదీ ఒక ఆశయం అంటే. ఇదీ ఒక సంకల్పం అంటే . ఇదీ భావితరాలకు ఉపయోగపడే ఒక ఆలోచన అంటే..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.