పెట్రోల్ బంక్ అంటే మనం డబ్బులివ్వడం, పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకోవడం , వెళ్లిపోవడమో కాదు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకోసం కొన్ని కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత పెట్రోల్ పంప్ యాజమాన్యాలపై ఉంది. వినియోగదారులకు మంచి నీళ్లు సౌకర్యం కల్పించాలి. టాయిలెట్ ఉండాలి. దాన్ని శుభ్రంగా ఉంచాలి. వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రం లేకపోయినా ఫిర్యాదు చేయొచ్చు. పెట్రోల్ పంప్ లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేకపోయినా , ఒకవేళ ఉంటె దానిలో మందులు లేకపోయినా ఫిర్యాదు చెయ్యొచ్చు.
పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగిందని అనుమానం వస్తే , తక్షణమే ప్రభుత్వ అధికారులకు , పెట్రోల్ కంపెనీల అధికారులకు ఫిర్యాదు చెయ్యొచ్చు. వాళ్ళ ఫోన్ నంబర్లు పెట్రోల్ బంక్ లో బహిరంగంగా పెట్టిఉంచాలి.పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చినా వెంటనే ఫిర్యాదుచేస్తే స్పందిస్తారు. పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన పక్షంలో వారిపై కూడా ఫిర్యాదు చెయ్యొచ్చు. పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. వాటి నంబర్లు ఇండియన్ ఆయిల్-1800233355, భారత్ పెట్రోలియం-1800224344,హెచ్పిసిఎల్-18002333555, రిలయన్స్-18008919023.

