ఈ కాలంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడటం సాధారణంగా జరిగేదే. వీటివల్లనే హెలికాఫ్టర్లు ప్రయాణం చేయలేవు. కొన్ని దఫాలు విమానాలు కూడా ఆ మేఘాలు ఉన్న దాపులకు కూడా పోవు. కుములోనింబస్ మేఘాలు 600 టన్నుల బరువుండే ఫైటర్ జెట్లను కూడా ఆటంకపరిచి ప్రమాదానికి గురిచేస్తాయి. అందుకే విమాన, మరియు హెలికాఫ్టర్లలో పోయేవారు ఈ మేఘాలు చూసి టేకాఫ్ కూడా ఆపేస్తారు. ఒక్కో క్యుములోనింబస్ మేఘంలో సగటున 500 టన్నుల బరువున్న నీరు ఉంటుంది. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి.
క్యుములోనింబస్ మేఘం వర్షిస్తే , ఆ ప్రాంతంలో కుంభవృష్టి ఉంటుంది. ఒక్కోదఫా క్లౌడ్ బరస్ట్ ఇలానే అవుతుంది.దీనివల్లనే కొండప్రాంతాల్లో చరియలు విరిగిపడి వినాశనానికి కారణం అవుతాయి. క్యుములోనింబస్ మేఘాలు సాధారణంగా నిలువుగా ఏర్పడతాయి. ఒక కిలోమీటర్ ఎత్తు , ఒక కిలోమీటర్ వెడల్పు తో ఏర్పడతాయి. పెద్దదయిన క్యుములోనింబస్ మేఘాలు ఒక్కోటి 5 లక్షల కిలోలు బరువు ఉంటాయి. వీటిని ఢీకొన్న విమానాలు , హెలికాఫ్టర్లు అక్కడికక్కడే నియంత్రణ తప్పి పడిపోతాయి. ఒక్కో క్యుములోనింబస్ మేఘం 100 ఏనుగుల బరువు అంత ఉంటుంది.
క్యుములోనింబస్ మేఘాలులో విద్యుత్ శక్తికూడా అధికంగానే ఉంటుంది. ఐస్ గడ్డలమధ్య వాయువుల రసాయనిక చర్యతో ఉరుములతో కూడిన మెరుపులు వస్తాయి.. మేఘాలలో నుంచి బలమైన గాలులు కిందకు వీస్తాయి. దీనివల్ల ఒక్కోదఫా తుఫానులాంటి వాతావరణం నెలకొంటుంది..క్యుములోనింబస్ మేఘాలులో కూడా గాలుల అల్లకల్లోలం ఎంతస్థాయిలో ఉంటుందో తెలుసా..? విమానాన్ని ముక్కలుచేసేంత బలంగా ఉంటుంది. అందుకే విమాన ప్రయాణాలలో క్యుములోనింబస్ మేఘాలు భద్రతాపరంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. సాంకేతిక విజ్ఞానం ఎంత పెరిగినా , ప్రకృతి శక్తి ముందు తలవంచక తప్పదు.. అదే సృష్టి రహస్యం..
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

