కడపలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో కడప ఎమ్మెల్యే మాధవికి అవమానం జరిగిందంటూ మీడియాలో గోలగోలగా ఉంది. ఈ విషయం వీడియోలో కూడా స్పష్టంగా తెలుస్తోంది . తనకు వేదిక మీద సముచితమైన గౌరవం లభించలేదని ఎమ్మెల్యే మాధవి రుసరుసలాడుతూ కనిపించింది. భర్తతో సహా వేదిక మీదికి చేరుకున్న ఎమ్మెల్యే మాధవికి కుర్చీ లేదని ఆమె కోప్పడింది . అయితే ఈ విషయాల్లో నిజానిజాలు ఎలా ఉన్నా స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు ఒక ప్రోటోకాల్ ఉంది. దేశ రాజధాని ఢిల్లీ స్థాయి నుంచి రాష్ట్రాల రాజధానులు ,మరియు జిల్లా కేంద్రాలు ,డివిజనల్ కేంద్రాలు, తాలూకా కేంద్రాలు, మండల, పంచాయితీ కేంద్రాల వరకు ఒక స్పష్టమైన నిబంధనల ముసాయిదా ఉంటుంది . ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూపొందించి పంపింది. ఎక్కడైనా సరే ఈ ముసాయిదా ప్రకారమే జాతీయ జెండాను ఆవిష్కరించాల్సి ఉంది.
ఈ ముసాయిదాల్లో ఆహ్వానం మొదలు సభ అయిపోయేంత వరకు ఎవరు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలా ,ఎవరు పతాక ఆవిష్కరణ తర్వాత ప్రసంగించాలా, భద్రతా దళాల వందనాన్ని ఎలా స్వీకరించాలా, ఎవరు స్వీకరించాలన్న విషయమై మార్గదర్శకాలు ఉన్నాయి . వాస్తవం ఇలా ఉండగా ఎప్పుడూ కూడా శాసనసభ్యులకు స్వాతంత్ర దినోత్సవ వేదిక మీద స్థానం లేదు . వారు కూర్చునేందుకు కూడా కుర్చీలు ఉండవు. డివిజన్, తాలూకా కేంద్రాలలో కూడా వారు జాతీయపతాక ఆవిష్కరణ చేయకూడదు. వారు వచ్చిన తర్వాత అతిధులకు కేటాయించిన ప్రత్యేకమైన గ్యాలరీలోని కూర్చోవాలి . అయితే కడపలో ఎమ్మెల్యే మాధవి వేదిక ఎక్కడం ఒక తప్పైతే ,ఆ వేదిక మీద తనకు సీటు లేదని కోప్పపడడం మరో పొరపాటు .
ఈ తప్పులు పొరపాట్లు ఎలా ఉన్నప్పటికీ ఆమె కోపపడడంతో అధికారులు ఒక కుర్చీ వేసి ఆమెను అక్కడ కూర్చోమని బతిమిలాడడం అధికారుల తప్పు కూడా అవుతుంది. అధికారులు ఈ విధంగా మార్గదర్శకాలకు, నిబంధనలకు ,నియమాలకు తిలోదకాలు ఇచ్చేసి ,ఎమ్మెల్యేలు, మంత్రులు కోపడుతున్నారని తెలిసి దాసోహం అనడం కూడా ఒక పొరపాటు . ఇది కూడా అధికారులు చేసిన తప్పుగానే భావించాలి . ఆమెకు ప్రోటోకోల్ రూల్స్ చెప్పిఉండాలి. అసలు ప్రజాప్రతినిధులు స్వాతంత్ర దినోత్సవం అలాంటి ముఖ్యమైన వేడుకల సందర్భంలో ప్రోటోకాల్ విషయం తెలుసుకోకవడం మన రాజకీయ వ్యవస్థకు పట్టిన గ్రహణం. చట్టం చట్టం లోని నిబంధనలు, మార్గదర్శకాలు నియమాలు ,ఆదేశిక సూత్రాలు వీటన్నిటిమీద ఎమ్మెల్యేలకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన నిరూపిస్తుంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

