ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడే చాలా తలనొప్పులు తెచ్చిపెట్టింది. ? భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలి. అసలు వ్యక్తులకు సంబంధం లేకుండానే మక్కీమక్కీ కాపీ అన్నట్టు వీడియోలు చేసేస్తున్నారు. ఫొటోలు వచ్చేస్తున్నాయి. ఇదో కలియుగ మాయలాగా తయారైంది. తాజాగా దీనిపై మెగా స్టార్ చిరంజీవి కోరుట్లో కేసు వేశారు,. దీంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించిన చిరంజీవికి ఊరటగా కోర్టు తీర్పు చెప్పింది. చిరంజీవి పేరు, ఫోటో, వాయిస్, చిత్రాలు అనుమతి లేకుండా వాడకూడదని ఆదేశం ఇచ్చింది.చిరంజీవి పేరును వాణిజ్య ప్రయోజనాలకు వాడకూడదన్న కోర్టు ఎలాంటి పదాలు వాడకూడదు కూడా చెప్పింది.
మెగాస్టార్, చిరు, అన్నయ్యలాంటి పేర్లు వాడకూడదు
చిరంజీవిని ఉద్దేశించి .మెగాస్టార్, చిరు, అన్నయ్య పేర్లతో ఏఐ మార్ఫింగ్ చేసే డిజిటల్ వేదికలపై కోర్టు ఆంక్షలు విధించింది. టీఆర్‌పీ రేటింగులకోసం , లాభాల కోసం చిరంజీవి పేరు దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశం ఇచ్చింది. ఇదే సందర్భంగా చిరంజీవి పేరు, ఫోటోలు దుర్వినియోగం చేసిన 30 మందికి కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 27కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.వాయిదా వేసింది. ఏఐ ఎఫెక్ట్‌పై ఇటీవల కోర్టులను ఆశ్రయించిన అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్, ఆశా భోస్లే, రజనీకాంత్, అక్కినేని నాగార్జున.. ఇప్పుడు అదే తరహాలో చిరంజీవికూడా కోర్టునుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

