ఒక వస్తువు దొరికితే తిరిగి ఇవ్వడం కష్టం.. అలాంటిది పొలంలో దొరికిన వజ్రాన్ని ఓ అజ్ఞాత భక్తుడు హుండీలో వేసాడు. ఆ వజ్రం విలువ రెండు కోట్లరూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అతడేదో ఇది వజ్రం అని తెలియకో ,లేదా దాని ధర తెలియకో ఇలా హుండీలో వేయలేదు. తనకు దొరికిన దానిని వజ్రాల వ్యాపారులకు చూపించి అది నిజమైన వజ్రమేమనని తేల్చుకున్నాడు.
దాని ధరకూడా వేసి , హుండీలో వేసాడు. అతడు ఆ వజ్రం తీసుకుంటే అడిగే వారు లేరు. ఎందుకంటే అది పొలంలో దొరికింది. కానీ అతడు దానిని అన్నమయ్య జిల్లా రాజంపేట లోని ఆంజనేయస్వామి ఆలయ హుండీలో వేసి , దీనితో నగచేయించి స్వామివారికి అలంకరించామని కోరాడు.
కలియుగంలో ఇలాంటి భక్తులు, నిజాయతీ పరులు ఇంకాఉన్నారంటే విశేషమే. ఈ విషయం తెలిసి దేవాదాయ శాఖ అధికారులు వచ్చి , దానిని పరిశీలించి విలువైనది, నిజమైనదిగా నిర్దారింఛి , దాని బరువు 1.39. 6 క్యారెట్లుగా తేల్చారు. ఈ వజ్రాన్ని ఆలయ ప్రధాన అర్చకుడు రవిస్వామి వద్దకు అప్పగించారు.
హుండీ లెక్కింపు పూర్తయిన అనంతరం ఈ వివరాలను అధికారికంగా ధృవీకరించారు. ఆలయానికి ఈ రకమైన సమర్పణలు స్వామివారి పట్ల భక్తుల విశ్వాసానికి దృఢత చేకూరుస్తున్నాయని దేవాదాయ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. దాని నాణ్యత ఆధారంగా, సుమారు రూ 70 లక్షలు నుండి రూ 2 కోట్లు ఉండే అవకాశం ఉందని వజ్రాల వ్యాపారులు చెబుతున్నారు.

