కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎక్కువగా మహిళలు చేయించుకుంటున్నారు. ట్యూబెక్టమి అనే విధానం మహిళలకు కుటుంబ నియంత్రణ కోసం చేసే ఆపరేషన్, మగవారికి చేసే ఆపరేషన్ వేసక్టమి.. ఈ రెండింటిలోనూ ఇక పిల్లలు వద్దు అనుకున్న పరిస్థితుల్లోనే చేస్తారు. కొన్ని అసాధారణ పరిస్థితిలో అత్యవసర పరిస్థితిలో వీటికి కూడా రివర్స్ ఆపరేషన్ చేసి మళ్ళీ యథాస్థితికి పిల్లలు పుట్టే పరిస్థితి తీసుకొస్తారు. అయితే ఇవి అరుదైన సందర్భంలో మాత్రమే విజయవంతం అవుతోంది.
దీంతో ఇప్పుడు పెళ్లయిన కొత్తల్లో లేదా ఒక బిడ్డ పుట్టిన తర్వాత రెండు మూడు ఏళ్ల పాటు బిడ్డలు వద్దనుకుంటే గర్భనిరోధక సాధనాలు లేదా లూప్ లేదా మాత్రలు వాడేపద్ధతి కాకుండా మగవాళ్లే రెండు ఏళ్లపాటు పాటు ఓ ఇంజెక్షన్ వేసుకుంటే సంతానం కలగకుండా ఆపగలిగే ఓ విధానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ విధానానికి ఆడం అని పేరు పెట్టారు. విస్తృత పరిశోధన తర్వాత ఈ విధానం ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ లోకి వచ్చింది.
మరో మూడు ఏళ్ల పాటు క్లినికల్ ట్రయల్స్ జరుగుతాయి.ఈ క్లినికల్ ట్రయల్స్ లో ఇది విజయవంతమైందని తెలిస్తే ఆ తర్వాత వైద్య పరంగా దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఈ విధానంలో మగవారి వీర్యంలో జీవకణాలను రెండు ఏళ్లపాటు నిర్వీర్యం చేయడం అనేది ఒక పద్ధతి. బహుశా ఇది క్లినికల్ ట్రయల్స్ తర్వాత విజయవంతం అయ్యే అవకాశం ఉందని, ఇది విజయవంతం అయితే మహిళలకు గర్భ నిరోధక సాధనాలు వాడవలసిన పనిలేదని చెబుతున్నారు. రెండు ఏళ్ల పాటు పిల్లలు వద్దనుకునే దంపతుల్లో మగవారు ఈ ఆడమ్ చికిత్స చేయించుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు.

