పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన సంచలన చిత్రంగా ప్రచారంలో ఉన్న హరిహర వీరమల్లు సినిమాని అడ్డుకునేందుకే , ఏపీలో ఎగ్జిబిటర్లు సినిమా హాల్స్ మూసెయ్యాలని నిర్ణయించారా ? దీని వెనుక వైసిపి కుట్ర ఉందా ..? గతంలో కారణాలనే ఇప్పుడు చూపించి అసోసియేషన్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందన్న అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో బలంగా ఉన్నాయి.
వచ్చేనెల ఒకటో తేదీ నుంచి సినిమా హాల్స్ మూసెయ్యాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయం వెనుక కుట్ర ఉందని, ఇది కేవలం పవన్ కళ్యాణ్ సినిమా ఆపేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఈ అనుమానాలతో రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి దుర్గేష్ ఎగ్జిబిటర్ల నిర్ణయంపై విచారణకు ఆదేశించారు. దీనివెనుక కుట్ర ఉంటె అదేమిటో తెలుసుకోవాలని చెప్పారట. సినిమా హాల్స్ మూసివేతతో ప్రభుత్వానికి రెవెన్యూ ఎంత పడిపోతుందో కూడా చెప్పాలని కోరారట..

