22.5 C
New York
Friday, April 3, 2026

Latest Posts

వెయ్యేళ్ళకు సరిపోయే హైడ్రోజెన్

అనంతమైన ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. పెరిగిపోతున్న జనాభా, సాంకేతిక పరిజ్ఞానం, నాగరికత వల్ల కార్బన్ కాలుష్యం ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మానవాళిని కాటేస్తోంది . అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వాతావరణం కాలుష్యం ముఖ్యంగా కార్బన్ కాలుష్యం జీవుల మరియు మానవాళి పాలిటి శాపం అయింది. వాహనాలు , ఫ్యాక్టరీలు ఇలా అనేక రంగాల నుంచి కాలుష్యం వెలువడుతూనే ఉంది. అంతరిక్షం కూడా కలుషితం అయిపోతుంది. వీటన్నింటికి సమాధానం ఒకటే. కాలుష్య నియంత్రణ ..

ఇప్పుడు వాటికి సమాధానంగా ఓ ఆశ మొలకెత్తింది. భూమి లోపల హైడ్రోజన్ వాయువు పుష్కలంగా ఉన్నది చెప్తున్నారు. ఈ సహజ హైడ్రోజెన్ వాయువు ప్రపంచానికి మరో వెయ్యేళ్లు అవసరాలు తీరుస్తుందని కూడా చెప్తున్నారు. హైడ్రోజన్ వాయువును జాగ్రత్తగా భూమి లోపల పొరలు తీయగలిగితే వాతావరణ కాలుష్యానికి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఇప్పుడు వాడే పెట్రోల్ డీజిల్ లాంటి ఇంధనాలతో పని లేదు. హైడ్రోజన్ తోనే వాహనాలు నడపొచ్చు. కర్మాగారాలు కాలుష్య రహితం చేయొచ్చు. విమానాలలోనూ ఇలా అనేక రకాలుగా హైడ్రోజన్ ను ఉపయోగించుకోవచ్చు.

హైడ్రోజన్ వల్ల కార్బన్ కాలుష్యం ఉండదు. ఏ ఇంజిన్ అయినా హైడ్రోజన్ ఉపయోగించుకున్న లేదా హైడ్రోజన్ బ్యాటరీ వాడినా దాన్నుంచి నీటి ఆవిర్లు మాత్రమే వస్తాయి తప్ప కార్బన్ వాయువులు వెలువడవు . భూగర్భంలో ఉన్న శిలాజలం నుంచి వచ్చే ఇంధనం లేదా ఆయిల్ లేదా గ్యాస్ నిక్షేపాలపై ఆధారపడాల్సిన పనిలేదు. ప్రస్తుతం కృత్రిమంగా తయారు చేసే హైడ్రోజన్ కన్నా భూగర్భంలో ఉన్న హైడ్రోజెన్ వెలికి తీయడం చాలాచౌకైన పని.

భవిష్యత్తులో వాతావరణ కాలుష్యం లేకుండా ఉండాలంటే, భావితరాల జీవితాలు భద్రంగా ఉండాలన్న ప్రస్తుతం శరవేగంగా సాగిపోతున్న సాంకేతిక ప్రగతి ఆగకుండా మరింత వేగంగా పోవాలన్న ప్రపంచం మొత్తం కాలుష్యం నుంచి మిముక్తి పొందాలన్నా , మానవాళి ఆరోగ్యంగా ఉండాలన్నా, హైడ్రోజన్ వాయువులను ఉపయోగించుకోవడం తప్పనిసరి పరిస్థితి. భూమిలో మన కాళ్ళ కింద హైడ్రోజన్ వెలికి తీయడం మర్చిపోయి తలమీద మృత్యువుని పెట్టుకొనే విధంగా వాతావరణ కాలుష్యం అనే మృత్యువు అని పెట్టుకొని బ్రతుకుతున్నాం. భావితరాల జీవితాలను నాశనం చేస్తున్నాం. అందువల్ల రాబోయే కాలంలో భూమి పొరల్లో ఉన్నాయి. లక్షల కోట్ల టన్నుల హైడ్రోజెన్ వెలికి తీసే బృహత్తర కార్యక్రమాలు రూపొందుకునే అవకాశం ఉంది..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.