30 ఏళ్ల క్రితం తాను వాడిన మారుతి 800 కారు కోసం ఓ కుబేరుడు 10 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి మళ్లీ ఆ కారును సొంతం చేసుకున్నాడు. ఈ కుబేరుడుకి దాదాపు 30 కార్లు ఉన్నాయి. వాటిలో 26 కార్లు విదేశీ కార్లే . అత్యంత ఖరీదైన కార్లు దాదాపు 100 కోట్లు విలువచేసే కార్లు దుబాయిలో, కేరళలోని, బెంగుళూరులోని తన ఇళ్లలో ఉన్నప్పటికీ సిరి సంపదలతో 30 ఏళ్ల నాటి మారుతి 800 కోసం సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి నానా తంటాలుపడి ఎట్టకేలకు ఆ కారును 10 లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు . 1994లో సీజే రాయ్ అనే ఈ వ్యక్తి ఒక లక్ష పదివేల రూపాయలకు మారుతి 800కారు కొన్నాడు. తర్వాత అతడికి అదృష్టం కలిసి వచ్చింది. కర్ణాటక, కేరళ ఇలా అనేక రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని దుబాయ్ కి మార్చుకున్నాడు.
సంపాదన మొదలుపెట్టిన తర్వాత కొన్న మొదటి కారు
తన సంపాదన మొదలుపెట్టిన తర్వాత కొన్న మొట్టమొదటి కారు మారుతి 800 .దానితో అదృష్టం కలిసొచ్చిందని అతడి నమ్మకం. సంపాదన ఎక్కువై కంపెనీలు స్థాపించిన తర్వాత కొత్త కార్ల మోజులో దుబాయ్ లోను ఇండియాలోనూ తనకి ఎక్కడైతే ఇల్లు ఉంటాయో అక్కడ అంతా కూడా కార్లు కొని పెట్టడం అలవాటు చేసుకున్నాడు. అయితే గత పదిహేళ్లుగా ఆయనను ఓ కోరిక వెంటాడింది. తను సంపాదన మొదట్లోకొన్న కారు కావాలని ఆశపడ్డాడు. దేనికోసం ప్రయత్నం చేసి ఎట్టకేలకు ఆ కార్ ఎక్కడుందో కనుక్కొని దాన్ని పది లక్షలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు ఇంతకీ ఆ మారుతి 800 కారు మీద అతనికి అంత మోజు ఎందుకో తెలుసా..? అది కలిసొచ్చిన కారు, పైగా దాని రిజిస్ట్రేషన్ నెంబర్ సికేజె 3637.. అదీ విషయం.. రిజిస్ట్రేషన్ నంబర్లు సీజే అనేది తన పేరు, నెంబర్ కూడా తనకు అదృష్ట సంఖ్య.. పైగా కలిసొచ్చిన కారు.
ఇవి కూడా చదవండి.
ఒక రోజైన కాకముందే విగతజీవిగా పెళ్ళికొడుకు

