తిరుమల శ్రీవారిని హీరోయిన్ ఆషికా రంగనాథ్ దర్శించుకున్నారు. ఈ ఉదయం నైవేద్య విరామంలో స్వామివారిని దర్శించుకొని.. దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు ఈమెకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం పొందారు. ఆషికా రంగనాథ్ తెలుగులో కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటించిన అమిగోస్‌తో తెలుగుతెరకు పరిచయమయ్యారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీలో ఆశికా రంగనాథన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట ఈ మూవీ కోసం ఓ ప్రత్యేకమైన కథను డిజైన్ చేసినట్టు ఇప్పటికే టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో వచ్చే ఈ సినిమా.. చిరు కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా నిలుస్తుందని చెబుతున్నారు. కీరవాణి ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తుండగా.. హీరోయిన్ త్రిష కూడా చిరు సరసన నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా రానుంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూలై నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ భావిస్తున్నారు.

