ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ కు ఒకటిన్నరన్నర గంటలో పోవడం సాధ్యమా..? దాదాపు 11 వేలకిలోమీటర్లున్న న్యూయార్క్ కి మామూలుగానే విమానంలో 16 గంటలు సమయం పడుతుంది. అయితే ఒకటిన్నర గంటలో ఎలా పోగలరని సందేహం అవసరం లేదు. చైనా రహస్యంగా ప్రయోగించిన హైపర్ సానిక్ జెట్ విజయవంతం అయింది. మూడు నెలల తరువాత వాటి వివరాలను తెలిపింది.
ఈ జెట్ గంటకు ఐదు వేల మైళ్ళ వేగంతో దూసుకుపోతుంది. అంటే గంటకు 8 వేలకిలోమీటర్ల దూరం పోగలదు. ఈ లెక్కన గంటన్నర సమయంలో ఢిల్లీనుంచి న్యూయార్క్ కి వెళ్లిపోవచ్చు. ఈ ప్రయోగాన్ని జియుకాన్ అంతరాఖ పరిశోధన కేంద్రం నుంచి గోబీ ఎడారిలో జరిపింది. ఈ మేరకు వీడియోలను చైనా అకాడెమీ ఆఫ్ సైన్సెస్ విడుదల చేసింది. ఈ విమానం ఎడారిలో టీమ్ లీడర్ కూయికై నేతృత్వంలో 20 నిమిషాలు ప్రయోగించి చూసారు..

