22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

వంద కిలోమీటర్ల దూరంలో ఫోటో తీసే లేజర్ కెమెరా.

చైనా గురించి ఎన్నిరకాల చెడుప్రచారాలున్నా , వాటిలో నిజానిజాల సంగతి ఎలాఉన్నా , ఒక్కటి మాత్రం మనం ఒప్పుకోవాల్సిందే.. సాంకేతికంగా ఆ దేశం అగ్రస్థానంలోనే ఉంది. మెజారిటీ ప్రపంచ దేశాలతో శత్రుత్వంలో కూడా సాంకేతికంగా అప్రతిహత విజయాలను సాధిస్తోంది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ప్రపంచమార్కెట్ లో చైనా స్తానం , చైనాదే.. తాజాగా చైనా తయారుచేసిన ఒక కెమెరా ప్రపంచాన్ని అబ్బురపరిచింది.

ఒక అద్భుతమైన లేజర్ ఇమేజింగ్ విధానంలో చైనా శాస్త్రవేత్తలు తయారుచేసిన ఈ కెమెరా వంద కిలోమీటర్ల దూరంలోని వస్తువుని స్పష్టంగా ఫొటో తీయగలడు. కింగాయి సరస్సునుంచి దీనితో ఫొటోలు తీసి చూసారు. ఈ సరస్సు 4580 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది.

వందకిలోమీటర్ల దూరంలోని వస్తువుని ఫొటో తీసి చూస్తే అతిదగ్గరనుంచి తీసినట్టే ఉంది. ఈ వివరాలు లేజర్స్ అనే చైనీస్ మ్యాగజైన్ లో ప్రచురించారు. ఈ కెమెరాతో ఆకాశం, అంతరిక్షంలో కంటికి కనిపించని వాటిని కెమెరాలో ఫొటోలు తీయవచ్చు.

 

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.