రైల్వే శాఖ టికెట్ రిజర్వేషన్ లో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది ఆన్ లైన్ టికెట్ రిజర్వేషన్ స్పీడ్ పెంచింది. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్వేర్ లో ఐదు నిమిషాలకు 32 వేలటికెట్లు బుకింగ్ కి మాత్రమే అవకాశం ఉంది. కొత్త విధానంలో దీనిని నిమిషానికి ఒకటిన్నర లక్షల టిక్కెట్లు బుక్ చేసుకునే విధంగా రూపొందించారు. ఇది ఈ ఏడాది ఆఖరు నుంచి అమలులోకి వస్తుంది. ఇంగ్లిష్, హిందీలోనే కాకుండా , ఏ భాషలో అయినా ఆన్ లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
వివిధ రాష్ట్రాలు, వివిధ బాషల ప్రజలకు ఇబ్బందిలేకుండా ఉండేందుకు టికెట్లు ఆన్ లైన్ బుకింగ్ లో బహుభాషా విధానాన్ని ప్రవేశపెట్టామని రైల్వే సఖ ప్రకటించింది. వెయింటింగ్ లిస్ట్ ను ఇకనుంచి ముందుగానే తయారుచేసి ప్రకటిస్తారు. తత్కాల్ విధానంలో టికెట్ల బుకింగ్ కి ఆధార్ లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఏదైనా వాడుకోవచ్చు. టికెట్ల విచారణను నిమిషానికి ప్రస్తుతం ఉన్న 4 లక్షల నుంచి 40 లక్షలకు పెంచారు.

