పశ్చిమగోదావరి జిల్లా పెద్దపాడు మండలం, మోహాంజీపాడు గ్రామానికి చెందిన పెద్దులు, దుర్గ దంపతులకు బంపర్ ఆఫర్ తగిలింది. బంపర్ ఆఫర్ అంటే లాటరీలో కాదు.. చంద్రబాబునాయుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన విధంగా 12 వతేదినుంచి తల్లికి వందనం కింద ఒక్కో చదువుకునే ఒక్కో బిడ్డకు 15 వేలరూపాయలు జమ చేసింది. ఈ పధకంలో ఒక ఇంట్లో ఎంతమంది బిడ్డలంటే అంత మందికి డబ్బులు ఇస్తామని ఎన్నికల హామీల్లో చెప్పినవిధంగానే , ఒక ఇంట్లో నలుగురు బిడ్డలకూ ఈ పధకంలో డబ్బులు జమ అయ్యాయి. దీంతో ఆ ఇంట్లో అనందం అంబరాన్ని అంటింది.
తల్లికి వందనం పధకంలో నలుగురు పిల్లలు ఉన్న ఈ దంపతులకు.. “తల్లికి వందనం” పధకం కింద 60 వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో పడింది. గత ప్రభుత్వంలో కేవలం ఒక్కరికి మాత్రమే డబ్బులు వచ్చేవని.. అయితే కూటమి ప్రభుత్వంలో నలుగురు పిల్లలకు “తల్లికి వందనం” పధకం ద్వారా 60 వేల రూపాయలు వచ్చాయని చెబుతోంది. ఇకపై తన నలుగురు బిడ్డలనూ ఆనందంగా చదివించుకుంటానని ఆమె తెలిపింది..
తల్లికి వందనం కింద రాష్ట్రంలోని 35 లక్షల, 44 వేల 499 మందికి బడికి పోయే ఒక్కో బిడ్డకు 15 వేల రూపాయలు చొప్పున జమ చేస్తున్నారు. ఈ డబ్బులతో వారు ఫీజులు, అవసరమైన పుస్తకాలను సమకూర్చుకోవాల్సిఉంది. ప్రతిపక్షాలు ఈ పథకంపై గత కొన్ని రోజులుగా ముమ్మరప్రచారం చేశారు. ఈ పధకంకి చంద్రబాబు మంగళం పాడేశాడని ఆరోపిస్తూ వచ్చారు. అయితే ఒక్క రోజే ఈ పధకం కింద భారీ స్థాయిలో విద్యార్థుల తల్లుల అకౌంట్స్ లో డబ్బులు జమ చేసారు. దీంతో ప్రతిపక్షాలు ఇప్పుడు ఏదో ఒక కొత్త రాగం అందుకోవాల్సిఉంది.

