22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

ఒక్క కొయ్యముక్క వాడకుండా కట్టిన వెయ్యేళ్ళ కోట

పూర్వకాలంలో రాజుల కోటలు, అంతఃపురాలు నిర్మాణం ఇప్పటికీ ,ఎప్పటికీ ఇంజనీరింగ్ అద్భుతమే . నేటి కాలంలో నిర్మాణాలకు గరిష్టంగా 40 ఏళ్లు లైఫ్ అని చెబుతుంటారు. అంటే ఆ భవనాలకు వాడే ఐరన్ కానీ ,సిమెంట్ గాని, లేదా ఇతరత్రా నిర్మాణాలకు వాడే సామాగ్రికి ఒక లైఫ్ పీరియడ్ అంటూ పెట్టిన దురదృష్టమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఇది. అయితే పూర్వకాలంలో కట్టే కోటలకు గాని , అంతఃపురాలకు గాని, భవనాలకు గాని , జీవితకాలం అంటూ ఏమీ ఉండదు. .కాలంతో పాటు అవి కూడా నిలిచిపోయి కనువిందు చేస్తున్నాయి . అదే ఆనాటి నిర్మాణాల్లోనే అద్భుతం, రహస్యం.

తిరుపతి జిల్లా చంద్రగిరిలో విజయనగర రాజుల కాలంలో నిర్మితమైన ఈ అంతఃపురాన్ని ఒకసారి చూడండి . విచిత్రం ఏమిటంటే ఈ అంతఃపురంలో ఒక్క కొయ్య ముక్క కూడా వాడకుండా దాన్ని నిర్మించారు . అప్పట్లో చుట్టూ అటవీ ప్రాంతం , కావలసినంత కొయ్య అందుబాటులో ఉన్నప్పటికీ ఒక కొయ్యముక్క కూడా ఈ అంతఃపుర నిర్మాణానికి వాడలేదు . మొత్తం రాజభవనం అంతా రాళ్లు ,సున్నంతోనే కట్టారు . అదనంగా బంకమట్టి కూడా వాడినట్టు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి.. ఈ మూడు పదార్థాలను ఉపయోగించి ఇంత అందమైన అద్భుతమైన రాజభవనాన్ని నిర్మించారు.

ఇప్పటికీ చెక్కుచెదరని గోడలు, వెలిసిపోని అందమైన గోపురం కూడా రాళ్లతోనే నిర్మితమైంది . ఇంత అద్భుతమైన రాతి కట్టడం చాలా అరుదైన భవనం . విజయనగర కాలంలో కట్టిన ఏ నిర్మాణంలో కూడా వారు కొయ్యవాడలేదు . దీనికి కారణం చరిత్ర పరిశోధకులు చెప్పేది ఒకటే.. ఏ కాలంలో నైనా కొయ్యకు ఒక లైఫ్ పీరియడ్ అంటే ఒక జీవితకాలం ఉంటుంది. గరిష్టంగా 100 నుంచి 120 ఏళ్ల వరకు కొయ్య చెక్కుచెదరకుండా ఉండేవి. నేటి కాలంలో కొయ్యల సంగతి పక్కన పెడదాం . అయితే రాజభవనాల నిర్మాణంలో అవి ఎప్పటికీ కాలం ఉన్నంతకాలం నిలిచి ఉండాలని ఉద్దేశంతోనే కొయ్య వాడకుండా ఆనాటి రాజభవనాలు కట్టారని చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు . దానికి నిదర్శనమే ఈ చంద్రగిరి కోట అంతపురం నిర్మాణం..

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.