టిడిపి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తానని ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన మాట మరిచిపోయినట్టున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పెట్రోల్ ధర 109 రూపాయల 60 పైసలు. డీజిల్ రేటు లీటరుకు 97 రూపాయల 47 [పైసలు ఉంది. తమిళనాడుతో పోల్చుకుంటే పెట్రోల్ ధర మన రాష్ట్రంలో తొమ్మిది రూపాయలు ఎక్కువ. అలాగే డీజిల్ ఆయిల్ ధర ఐదు రూపాయలు అధికం. తెలంగాణతో పోల్చుకున్నా , మన రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ ధరలే ఎక్కువే.
గత జగన్ ప్రభుత్వం అధికంగా వీటిపై వేసిన పన్నులవల్లనే ఈ పరిస్థితి దాపురించింది. అయితే గత ఎన్నికల్లో ఈ అంశాన్నే చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేక ఎన్నికల ప్రచార సభల్లో ప్రస్తావించి రేట్లు పక్క రాష్ట్రాలతో పోల్చి చెప్పారు. ఇది అన్యాయమంటూ ఆక్రోశించారు. అయితే అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలైనా ఆ విష్యం వదిలేసినట్టున్నారు. ప్రతిపక్షంలో ఒక మాట , అధికారంలోకి వస్తే మరోమాటగా ఉంది రాజకీయనాయకుల ధోరణి..

