ఈ పొట్టి మేకను చూసారా..? దీని కథ చాలానే ఉంది . ఈ పొట్టి మేక అసలు పేరు కెనడియన్ పిగ్మీ గోట్. ఇప్పుడు మన దేశంలో చాలా ప్రాంతాల్లో దీన్ని పెంపుడు మేకగాను, వాణిజ్యపరంగాను పెంచుకుంటున్నారు. అసలు దీని పుట్టుక ఆఫ్రికా ఖండం . అక్కడి నుంచి ఉత్తర అమెరికాకు వచ్చింది. ఉత్తర అమెరికా నుంచి ఇది కెనడాకు వచ్చింది. కానీ పేరు మాత్రం కెనడియన్ గోట్ అని పిలుస్తారు. అక్కడి నుంచి మన భారతదేశం వచ్చి వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. కేరళలో కురుంబి అని, తమిళనాడు ఆంధ్ర రాష్ట్రాల్లో కంచి మేక అని , ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. ఈ మేకలో ఓ విశేషం ఉంటుంది.
ఒకటి నుంచి ఒకటిన్నర అడుగులు ఎత్తు ఉంటుంది. గరిష్టంగా రెండడుగులు మాత్రమే పెరుగుతుంది . మామూలుగా అయితే సాధారణంగా ఈ మేక అడుగు నుంచి అడుగున్నర వరకు ఉంటుంది. రెండు అడుగులు ఉంటే పొడవు అయిన మేక అని లెక్క . సాధారణంగా మేకలు ఆకులు మాత్రమే తింటాయి. అయితే ఈ మేక ఆకులతో పాటు గడ్డి కూడా మేస్తుంది. ఒకదాఫా రెండు నుంచి మూడు పిల్లలను ఈనగలదు . ఈ మేక ఇంట్లో ఉంటే,కుక్కలతో, పిల్లలతో ,మనుషులతోనూ, పశువులతోనూ బాగా కలిసిపోయి కలివిడిగా తిరుగుతోంది. కొంతమంది ఈ మేకను పెంపుడు మేకగా పెంచుకుంటారు. ఇంటికి వచ్చే వారితో అలవాటైతే వారి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది . అదీ ఈ పొట్టి మేక విశేషం..

