వివిధ రకాల కారణాలతో చూపు కోల్పోయిన వారికి ఓ ఆశా రేఖ కళ్ళముందు కనిపిస్తుంది. అదుపులో పెట్టుకోలేని డయాబెటిస్, లేదా వృద్ధాప్యం, బిపి లేదా ఇతరత్రా కారణాలవల్ల, ప్రమాదాలలో పూర్తిగా చూపు కోల్పోయిన వారికి , పాక్షికంగా చూపు మందగించిన వారికి శాస్త్ర వేత్తల పరిశోధనలతో ఓ ఆశ మొదలైంది. పోయిన చూపు మళ్ళీ వస్తుందన్న శాస్త్రవేత్తల భరోసా వాళ్ళ అంధ జీవితాల్లో ఆశల మొలకలు వేస్తోంది . వైద్య రంగంలో దీనిని సంచలనాత్మకమైన పరిశోధనగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
చూపు కోల్పోయిన పేషంట్లకు సంబంధించిన కంటి మూలకణాలతో కార్నియాకు జరిగిన గాయాలను పూర్తిగా మాన్పి మళ్ళీ చూపు ప్రసాదిస్తాయని చెప్తున్నారు. ఈ విధానాన్ని క్యాలక్ (CALEC ) అంటారు. అంటే కల్టివేటెడ్ ఆటో లోగో లింబాల్ సెల్ ట్రాన్స్ ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఒక చిన్న కణజాలాన్ని అంటే మూల కణాలను ఆరోగ్యంగా ఉండే అదే వ్యక్తి కంటి నుంచి తీసుకొని ప్రయోగశాలలో దాని నుంచి ఆరోగ్యవంతమైన కణాలను ఉత్పత్తి చేస్తారు. వీటిని దెబ్బతిన్న కంటిలో ప్రవేశపెడతారు. ప్రస్తుతానికి క్లినికల్ ట్రైల్స్ లో 90 శాతానికి పైగా ఈ విధానం విజయవంతం అయిందని చెబుతున్నారు.
ఒక కంటిలో పూర్తిగా చూపు కోల్పోయిన వారు లేదా పాక్షికంగా కోల్పోయిన వారికి మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. చూపు కూడా బాగా వచ్చిందని దీనివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదని చెప్తున్నారు. దెబ్బతిన్న వారికి వివిధ రకాల కారణాలతో మధ్యలో చూపు కోల్పోయిన వారికి ఒక కంటికి మాత్ర స్టెమ్ సెల్స్ ద్వారా జరిగే ఈ చికిత్స పూర్తిగా సురక్షితమైనది. ఇమ్యునో సప్రెస్ అంటే రోగనిరోధక వ్యవస్థ తిరగబడే విధానంలో ఇది పూర్తిగా నమ్మదగినదని చెప్పారు మూలకణాల కోసం డోనర్ల మీద ఆధార పడవలసిన అవసరం లేదని కణజాలం మార్పిడి తర్వాత ప్రతిరోజు అది దాన్ని శరీరం అంగీకరించేందుకు లేదా తిరస్కరించకుండా ఉండేందుకు మందులు వాడాల్సిన పని కూడా లేదని శాస్త్రవేత్తలు చెప్పారు.
ఎందుకంటే డోనర్ పేషెంట్ ఒకరే కాబట్టి మూల కణాలు బాగాలేని కంటిలో పెట్టిన తర్వాత మందులు వాడాల్సిన పనిలేదు.ఈ విధానం క్లినికల్ ట్రయల్స్ లో బయటపడి సామాన్యులకు అందే విధంగా తయారైతే ఒక విప్లమాతమైన మార్పు రావడం తద్యం..

