22.5 C
New York
Wednesday, December 10, 2025

Latest Posts

నేటి తరానికి తెలియని బుల్బుల్ తరంగ్ .

ఒకప్పుడు మనదేశంలో జానపదుల్లో సప్తస్వరాల విప్లవానికి కారణమైన బుల్ బుల్ సంగీతపరికరం కనుమరుగుఅవుతొంది. ఇప్పటి తరానికి బుల్ బుల్ తరంగ్ సంగీత పరికరం ఎలాఉంటుందో తెలియదు. , దానిపై స్వరాలు దానిపై అదృష్టమూ లేదు..విదేశీ ఎలెక్ట్రానిక్ వాయిద్యాల విప్లవం ముందు ఇది వెనుకపడిపోయింది. మనదేశంలో ప్రతి సంగీత కచేరీలోనూ ,ప్రతి చోట మన సాంప్రదాయకమైన సంగీత వాయిద్యాలతో పాటు ఈ బుల్బుల్ సంగీత పరికరం ఒక విప్లవం సృష్టించింది. మగ బుల్బుల్ పిట్ట రాత్రిళ్ళు , ఆడ బుల్బుల్ పిట్టలను ఆకర్షించేందుకు కూస్తూనే ఉంటుంది. ఆ విరహ కూత పేరుమీదనే ఈ పరికరానికి బుల్బుల్ అన్న పేరు స్థిరపడిపోయింది.

ఈ బుల్బుల్ తరంగ్ అంటే ఇదేదో విదేశాల్లో తయారై వచ్చింది కాదు. స్వయంగా మన భారతదేశంలోని పంజాబ్ లో 1930లో ఈ వాయిద్య పరికరం ప్రచారంలోకి వచ్చింది . స్వదేశీయంగానే దీన్ని తయారు చేశారు . అప్పట్లో జానపదాలకు ,జనపద కళాకారులకు బుల్బుల్ ఒక వరప్రసాదంలాగా మారింది . సాంప్రదాయకమైన వీణ లాంటి పరికరాలు వాడేవారు. ఇలాంటివన్నీ అప్పట్లో కూడా ఖరీదైన సంగీత పరికరాలు. అలాంటి పరిస్థితుల్లో పేద కళాకారుల కోసం సృష్టించింది ఈ బుల్బుల్ . దీనిలో రెండు ప్రధాన తంత్రులు ఉంటాయి. మిగిలిన 12 తంత్రులుఉంటాయి. ఇవి రెండు సెట్లుగా , ప్రధాన తంత్రులకు కలిపిఉంటాయి. ఇవన్నీ బుల్బుల్ కీబోర్డు బటన్స్ కి కలిపిఉంటాయి.,

ఈ కీబోర్డు టైప్ రైటర్ కీబోర్డ్ ని పోలి ఉంటుంది. ఈ కీబోర్డు నొక్కినప్పుడు బుల్బుల్ తీగలు సరిగమలు పలికిస్తాయి . ఒక్కో కీబోర్డు ఒక్కొక్క బటను ఒక్కొక్క స్వరాన్ని వినిపించేటట్టు దీన్ని రూపొందించారు . బుల్బుల్ నేర్చుకోవాలంటే చాలా అనుభవం ఉండాలి . ఓవైపు తీగలు మీటుతూ ,మరోవైపు కీబోర్డు లో సరిగమపదనిసల స్వరాలను అనుకరిస్తూ దీనిమీద సంగీతము పలికించాలి. ఈ బుల్బుల్ సంగీత పరికరం ఒకప్పుడు భజనలు ,గజల్సు మెఫిల్సు ,మరియు కవాలిలో విస్తృతంగా వినియోగించారు. ప్రముఖ సంగీత విద్వాంసుడు ఆర్డీబర్మన్ కూడా బుల్బుల్ మీదనే స్వరాలను కూరుస్తాడు . ఎలక్ట్రానిక్ పరికరాల ప్రవేశంతో బుల్బుల్ వైభవం క్రమంగా కనుమరుగైపోయింది . అయితే ఇప్పటికీ గజల్స్, కవాలిలు సందర్భంగా బుల్బుల్ ను అరుదుగా ఉపయోగిస్తున్నారు.

Latest Posts

Don't Miss

Stay in touch

To be updated with all the latest news, offers and special announcements.