కొన్నిసార్లు మనం నమ్మలేని సంఘటనలు జరుగుతుంటాయి. పేదల ఇళ్లలోనూ చదువుల పారిజాత పూలు పోస్తుంటాయి . అలాంటిదే ఈ సంఘటన. బృదేవ్ అనే యువకుడికి తాను ఐఏఎస్ కు ఎంపికయ్యానని తెలిసే సమయానికి అతడు తన కుటుంబానికి చెందిన గొర్రెలను మేపుకుంటూ ఉన్నాడు .వృత్తి రీత్యా వ్యవసాయ కుటుంబం . గొర్రెల పెంపకం ప్రధాన జీవనం చిన్నప్పటి నుంచి కఠినమైన పేదరికంలో పెరిగిన బ్రుదేవ్ చిన్ననాడు చదువుకునేందుకు ఇల్లు కూడా లేదు వానొస్తే వానంతా ఇంట్లోనే కురిసేది. అందువల్ల చదువుకునేందుకు గ్రామంలోని స్కూల్ కెళ్ళి రాత్రి సమయంలో దీపం పెట్టుకొని స్కూల్ అయిపోయిన తర్వాత కూడా స్కూల్లోనే వరండాలో చదువుకునేవాడు.
ఆ తర్వాత కాలేజీ చదువుల్లో కూడా ఇంటికి వచ్చినప్పుడు తను చిన్ననాడు చదువుకున్న స్కూలుకి వెళ్ళి అక్కడ వరండాలనే చదువుకునేవారు. ఇంత పేదరికంలో కూలి పని చేసుకుంటూ చదివి,యు పి ఎస్ సి ఎగ్జామ్స్ 551 ర్యాంకు సాధించాడు. తనకి సివిల్స్ లో ర్యాంక్ వచ్చిందని కూడా అతడు గొర్రెల మేపుకుంటున్నప్పుడు స్నేహితుల వెళ్లి చెప్పారు . తన కొడుకుకొచ్చిన గౌరవం , అతను ఏమి పాస్ అయ్యాడో ,అది పాస్ అయిన తర్వాత అతడు ఏమి కాబోతున్నాడో కూడా తండ్రికి తెలియదు .. అతనికి తెలిసిందల్లా తన కొడుకు కష్టం,..
వ్యవసాయంలో గానీ ,గొర్రెలు పెంపకం, చదువులో కానీ తన కొడుకు కష్టపడతారని మాత్రమే తెలుసు .. బ్రుదేవ్ లాంటి కొడుకును కన్నందుకు గ్రామస్తులంతా తండ్రికి సన్మానం చేసి ,ఆయన కొడుకు ఏం సాధించాడు , ఏ ఉద్యోగం చేయబోతున్నాడో చెప్పినప్పుడు మాత్రం ఆ తండ్రి ఆనంద భాష్పాలు రాల్చాడు . బ్రుదేవ్ మాత్రం ఇదంతా తన తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమే తనకు ఫలించిందని పూర్వ జన్మలో వాళ్ళ సుకృతమే ఈ జన్మలో తనకు ఈ గౌరవం అని ఆనందించాడు.. గ్రామస్తులంతా వచ్చి సన్మానం చేసినప్పుడు కూడా తన చంకలో గొర్రె పిల్లను పెట్టుకుని ఫోటో తీసుకున్నాడు. ఈ గొర్రెలే తమకు జీవన ఉపాధి అని ,తమ కుటుంబాన్ని ఇంతవరకు పోషించాయని చెప్తున్నాడు..

