కేసీఆర్ పార్టీ బిఆర్ ఎస్ లో కేసీఆర్ కూతురు కవిత కుంపటి రాజేసింది. ఈ చిచ్చు తాజాగా ఆమె ప్రకటనతో రాజుకుంది. ఇది పార్టీని కాల్చేస్తుందో, కవితనే మాడ్చేస్తుందో చూడాలి. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేసి కుట్ర ఎప్పటినుంచో జరుగుతోందని కవిత ధ్వజమెత్తింది. ఢిల్లీలో తానూ జైల్లో ఉండగానే ఇది మొదలైందని, లోపాయికారీగా చర్చలు జరిగాయని చెప్పింది. కేసీఆర్ కూతుర్ని, కేటీఆర్ కి చెల్లెల్ని , అయిన తనపై కిరాయి మనుషులచేత మాట్లాడిస్తున్నారని మండిపడింది.
నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది- తన జోలికి వస్తే బాగుండదని హెచ్చరించింది. జైలుకు వెళ్లేటప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానన్నా అయినా వారించారు. లేఖను బయటకు లీక్ చేసిందెవరు.. అలాంటి లీకువీరులను పట్టుకోమంటే, గ్రీకువీరులు దండెత్తి నామీదకొస్తారు.ఇదేమి న్యాయం అంటూ నిలదీసింది. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని , పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని స్పష్టం చేసారు.
కేసీఆర్‌ను మేమే , ఆయనకు కళ్లు, మేమే అంటారు..కేసీఆర్‌ను నడిపించేంత పెద్దవాళ్లా మీరు అంటూ కవిత నిలదీసింది. నేను వాళ్లలా చిచోరా రాజకీయాలు చేయను, హుందాగా ఉంటానాని తెలిపింది. పార్టీలో కోవర్టులు ఉన్నప్పుడు ఎందుకు పక్కనపెట్టడం లేదని నిలదీసింది. బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు అంటూ కవిత తన లేఖాస్త్రాన్ని కేటీఆర్ పై సంధించింది..
బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడని , పార్టీలో ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని స్పష్టం చేసారు. గత ఎంపీ ఎన్నికల్లో కూడా పధకం ప్రకారం నన్ను ఓడించారు. నేను ఓడిపోతే ఎవరికి లాభమో అందరికీ తెలుసు.. వాళ్ళే నన్ను పార్టీనుంచి పంపెయ్యాలని చూస్తున్నారు.. అంటూ మండిపడింది..

