ఆంధ్రప్రదేశ్ లో రెడ్ తరహాలోనే తెలంగాణలోనూ పింక్ బుక్ రెడీ అవుతుందట. టీడీపీ చిన్న బాస్ లోకేష్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో రెడ్ బుక్ ప్రచారంలోకి వచ్చింది. చట్టవ్యతిరేకంగా పనిచేసే అధికారులు, టిడిపి వారిని వేదించే అధికారులు, వైసిపి నేతల పేర్లు రెడ్ బుక్ లో ఉంటాయని , తాము అధికారంలోకి వచ్చినవెంటనే రెడ్ బుక్ లో పేర్లున్న వారిపై చర్యలుంటాయని చెప్పేవాడు.
అదే విధంగా ఆ రెడ్ బుక్ ని కూడా చూపించేవారు. ఇప్పుడు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తన నేతలు అరెస్టులపై వైసిపి రచ్చ చేస్తోంది. లోకేష్ రెడ్ బుక్ లాగానే , తెలంగాణలోకూడా కేసీఆర్ కూతురు కవిత పింక్ బుక్ లో తమ పార్టీ వారిని వేధించే అధికారులు, నేతల పేర్లుంటాయని చెప్పింది. అందరి చిట్టాలు రాస్తాం, ఒక్కరినీ కూడా వదిలిపెట్టం అంటూ శపధం చేసారు.

