ఈ నెల 22, 23 తేదీలలో నింగిలో మరో అద్భుతం జరగనుండి. విశాల విశ్వంలో జరిగే కోటానుకోట్ల వింతలలో ఇదొకటి. సైన్స్ కి తెలిసిన అద్భుతాలు వందకోట్లకు ఒకటి మాత్రమే.. అదీ అనంత సృష్టి రహస్యం. ఈ నెల 22, 23 తేదీలలో జరిగే ఈ వింత ప్రతి 33 నెలలకు ఒకసారి జరిగేదే.. అయితే అది క్రమం తప్పకుండ జరుగుతుంది. పౌర్ణమి, అమావాస్యలకు వేదకాలంనుంచి ఒక ప్రత్యేక ప్రాధాన్యం , విశేషాలు ఉన్నాయి. అవి శాస్త్రీయంగా కూడా నిరూపితాలే. అలాంటి అద్భుతమే ఇది. అమావాస్య రోజు చీకటిగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు.

అయితే ఈ నెల 22, 23 తేదీలలో అమావాస్య చీకట్లకు విశేషం ఉంది. సూర్యుడు కాంతి చంద్రుడిపై పడకపోవడంతో ఆ రోజు మరింత చీకటిగా ఉంటుంది. ఇలాంటివి ఖగోళ రుతువులో నాలుగు బ్లాక్ మూన్స్ వస్తాయి. అంటే నాలుగు రుతువులలో నాలుగు బ్లాక్ మూన్స్ వస్తాయి. అలాగే 33 నెలలకు ఒకసారి వచ్చే ఈ బ్లాక్ మూన్ విశేషమైనది. ఖగోళ పరంగా ఆకాశంలో నల్లగా ఉండటంతో , నక్షత్రాల అధ్యయనానికి ఉపకరిస్తుంది. జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఈ అమావాస్యకి ప్రత్యేకత ఉంది.

కుటుంబకలహాల, వ్యాపార వ్యవహారాలలో విబేధాలు, ఆస్తుల గొడవలు.. ఇలాంటివన్నీ సామరస్యంగా పరిష్కరించుకుని కొత్త ఆశలతో , కొత్త జీవితం మొదలుపెట్టేందుకు ఇది మంచి సమయం. అన్ని గ్రహాలు అనుకూలించే మంచి ముహూర్తం. ఆత్మపరిశీలనకు , పట్టుదలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు అనుకూల పరిస్థితులను కలిగిస్తుంది. మిమ్మల్ని బాధించే పాత జ్ఞాపకాలు, మనుషులు , అనుబంధాలను వదులుకుని కొత్త జీవితానికి స్వాగతం పలకమని ఈ కలం సూచిస్తోంది. అలాగే మన తప్పులుపై ఆత్మపరిశీలనకూడా చేసుకొని , సరిదిద్దుకుని ముందుకు సాగమని హితవు చెబుతొంది.
ఇవి కూడా చదవండి.
ఆ ఫొటోలు బయటపెడుతున్నాడు, ఆపండి సార్..

